Skanda: రామ్, బోయపాటి సినిమాలో దొర్లిన ఎడిటింగ్ తప్పు, నెటిజన్స్ ట్రోలింగ్
ABN , First Publish Date - 2023-11-03T13:00:18+05:30 IST
'స్కంద' సినిమా బోయపాటి మార్కులో వచ్చిన ఒక యాక్షన్ చిత్రం. ఇందులో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. ఇప్పుడు ఇది ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఒక చిన్న తప్పు దొర్లింది, అది సాంఘీక మాధ్యమంలో ట్రోల్ చేస్తున్నారు.
రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి శ్రీను (BoyapatiSrinu) దర్శకత్వం లో వచ్చిన 'స్కంద' #Skanda ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టిపికల్ బోయపాటి మార్కు వున్న ఒక యాక్షన్ చిత్రం. ఈ సినిమా కోసం రామ్ పోతినేని కొంచెం బరువు పెరిగిన విషయం కూడా తెలిసిందే. శ్రీలీల (Sreeleela) కథానాయకురాలిగా చేసింది. ఈ సినిమాకి మిక్సెడ్ రివ్యూస్ వచ్చాయి. థియేటర్స్ లో ఈ సినిమా వ్యాపారపరంగా అంతగా నడవలేదు.
ఓటిటి లో విడుదలయ్యాక చాలామంది చూస్తున్నారు ఈ సినిమాని, అలాగే సాంఘీక మాధ్యమంలో ఈ సినిమాలో ఒక చిన్న తప్పు దొర్లింది, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే, రామ్ పోతినేని సినిమాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చాక ఒక పెద్ద పోరాటసన్నివేశంలో పాల్గొంటాడు.
ఆ సన్నివేశంలో రామ్ ఒక ఆఫీసర్ ని పిస్తోలుతో కాల్చేస్తాడు. కానీ విచిత్రంగా అదే ఆఫీసర్ మళ్ళీ ఆ ముఖ్యమంత్రి వెనకాల కనపడతాడు. అంటే ఎడిటింగ్ లో చూసుకోకపోవటం వలన ఇదొక పెద్ద తప్పుగా దొర్లింది. ఇక నెటిజన్స్ వెంటనే ఈ తప్పుని పట్టుకొని ట్రోలింగ్ చెయ్యడం మొదలెట్టేసాడు.