Baby Team: ‘బేబీ’ సినిమాలో ఆ సీన్లపై పోలీస్ కమిషనర్‌కు వివరణ ఇచ్చాం

ABN , First Publish Date - 2023-09-14T20:23:14+05:30 IST

‘బేబీ’ మూవీ దర్శకనిర్మాతలకు అడ్వైజరీ నోటీసులు ఇవ్వడమే కాకుండా.. సినిమాలో అలాంటి సన్నివేశాలు ఎందుకు చూపించాల్సి వచ్చిందో సీపీ వివరణ అడిగినట్లుగా ‘బేబీ’ మూవీ దర్శకనిర్మాతలు మీడియాకు తెలియజేశారు.

Baby Team: ‘బేబీ’ సినిమాలో ఆ సీన్లపై పోలీస్ కమిషనర్‌కు వివరణ ఇచ్చాం
Baby Movie Director and Producer with CP CV Anand

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘బేబీ’ (Baby) సినిమాలో మాదకద్రవ్యాలు ఎలా వినియోగించాలో చెప్పే సన్నివేశాలున్నాయంటూ.. ఆ సీన్స్‌ని ప్రత్యేకంగా ప్రదర్శించి మరీ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ (CV Anand) ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని.. ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‌లో రైడ్ చేసినప్పుడు ఉన్న సీన్ చూస్తే.. సేమ్ టు సేమ్ ‘బేబీ’ సినిమాలో ఉన్నట్లే కనిపించాయని సిపి ఆనంద్ ఫైర్ అయ్యారు. అంతేకాదు, బేబీ మూవీ చిత్ర దర్శకనిర్మాతలకు నోటీసులు కూడా పంపనున్నట్లుగా సీపీ చెప్పుకొచ్చారు. అయితే ‘బేబీ’ మూవీ దర్శకనిర్మాతలకు అడ్వైజరీ నోటీసులు ఇవ్వడమే కాకుండా.. సినిమాలో అలాంటి సన్నివేశాలు ఎందుకు చూపించాల్సి వచ్చిందో సీపీ వివరణ అడిగినట్లుగా ‘బేబీ’ మూవీ దర్శకనిర్మాతలు మీడియాకు తెలియజేశారు.

‘‘నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుండి ఫోన్ వచ్చింది. ‘బేబీ’ సినిమాలో ఒక సన్నివేశం గురించి ఆరా తీశారు. అలాంటి సీన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరణ అడిగారు. సన్నివేశంలో భాగంగా పెట్టాల్సి వచ్చిందని చెప్పాము. సేమ్ సీన్స్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆనవాళ్లు బయటకు వచ్చాయి అని చెప్పారు. సమాజంకి మంచి మెసేజ్ ఉండేలా సినిమాలు తీయాలని చెప్పడం జరిగింది. ఇదే విషయం మా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకీ చెప్పమన్నారు. మాకు అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు..’’ అని నిర్మాత SKN, దర్శకుడు సాయిరాజేష్ (Sai Rajesh) తెలిపారు.


అంతకు ముందు సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ బేబీ సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారు. సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు పెట్టి కనీసం హెచ్చరిక కూడా చేయకుండా డైరెక్ట్‌గా ప్లే చేశారు. మేము హెచ్చరించిన తర్వాత యూనిట్ ‘హెచ్చరిక’ లైన్ వేశారు. ఇపుడు ‘బేబీ’ సినిమా ప్రొడ్యూసర్‌కి నోటీసులు ఇస్తాము. ‘బేబీ’ (Baby) సినిమాలో డ్రగ్స్ ఏవిధంగా వినియోగదారుల ఉపయోగించాలనే దృశ్యాలను చూపించారు. ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక నుంచి అన్ని సినిమాలపై మా ఫోకస్ ఉంటుంది. డ్రగ్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటే ఊరుకునేదే లేదు’’ అని తెలుపుతూ.. ‘బేబీ’ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను ప్లే చేసి మరీ సీపీ వివరించారు.


ఇవి కూడా చదవండి:

============================

*CP CV Anand: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ ప్రకంపనలు.. ‘బేబీ’ టీమ్‌కు నోటీసులు.. పరారీలో హీరో!

***********************************

*Devil: సిద్ శ్రీరామ్ పాడిన పాట.. విడుదల ఎప్పుడంటే..

***********************************

*Tamannaah Bhatia: తమన్నాకు ‘జైలర్‌’ నిర్మాత బహుమతి ఏది?

***********************************

*Operation Valentine: మెగా ప్రిన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తాజా అప్‌డేట్

************************************

Updated Date - 2023-09-14T20:23:14+05:30 IST