Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 5 ప్రియాంక, టాప్ 4 యావర్

ABN , First Publish Date - 2023-12-17T22:27:55+05:30 IST

దాదాపు 105 రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 7 ఫినాలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. టాప్ 6 కంటెస్టెంట్స్‌గా ఉన్న పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌‌లలో.. అర్జున్ టాప్ 6 స్థానంతో హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 5 స్థానం ప్రియాంక, టాప్ 4 స్థానం ప్రిన్స్ యావర్ సొంతం చేసుకుని.. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 5 ప్రియాంక, టాప్ 4 యావర్
Prince Yawar Gets 15 Lakhs

దాదాపు 105 రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 7 ఫినాలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. టాప్ 6 కంటెస్టెంట్స్‌గా ఉన్న పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌‌లలో.. అర్జున్ టాప్ 6 స్థానంతో హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 5 స్థానం ప్రియాంక, టాప్ 4 స్థానం ప్రిన్స్ యావర్ సొంతం చేసుకుని.. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ముందుగా టాప్ 6 స్థానంలో ఎలిమినేటై స్టేజ్‌పై‌కి వచ్చిన అర్జున్ తన భార్యతో కలిసి కాసేపు ముచ్చటించాడు. అనంతరం ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్‌తో కింగ్ నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారికి కొన్ని బిరుదులను కూడా ఇచ్చారు. ఆ బిరుదులను ఒక్కసారి పరిశీలిస్తే..

Priyanka.jpg

పిడకలు- దామిని

ఇన్‌స్టంట్ న్యూడిల్స్- నయని పావని

వాటర్ బాటిల్ - పూజా మూర్తి

రెడ్ లిప్‌స్టిక్ - శుభశ్రీ

ఉడుత - రతిక

సంచాలక్ ఆఫ్ సీజన్ - సందీప్ మాస్టర్

గోల్డెన్ మైక్ - భోలే షావళి

టిష్యూ - అశ్విని

డంబెల్ - గౌతమ్

ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టి


Yawar.jpg

ఈ అవార్డులతో పండిన కామెడీ తర్వాత ‘వీరసింహారెడ్డి’ మనోభావాలు భామ చంద్రికా రవి అందరి మనసులు దోచుకునేలా.. అదిరిపోయే స్టెప్పులతో స్టేజ్‌పై కాకరేపింది. అనంతరం రవితేజ ఎంట్రీ. తన ‘ఈగల్’ సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన మాస్ రాజా.. తన అభిమాని అయిన అమర్‌‌కు బంపరాఫర్ ప్రకటించాడు. రవితేజ కాదులే కానీ.. నాగార్జునే అమర్‌కు వున్నపళంగా హౌస్ నుండి వచ్చేస్తే.. రవితేజ తర్వాత సినిమాలో ఛాన్స్ ఉంటుందని చెప్పాడు. అంతే.. మరో ఆలోచన లేకుండా అమర్ రెడీ అయిపోయాడు. ఇది చూసి కింగ్, మాస్ రాజా ఇద్దరూ ఆశ్చర్యపోయారు. రవితేజ అయితే కాస్తంత భావోద్వేగానికి కూడా లోనయ్యారు. ఈ డ్రామా అనంతరం ప్రియాంక ఎలిమినేట్ అయినట్లుగా రవితేజ ప్రకటించాడు. ఎలిమినేట్ అయినా.. చివరి వరకు హౌస్‌లో ఉన్నందుకు హ్యాపీగా ఉందంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది.

అనంతరం స్టేజ్‌పైకి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వచ్చారు. వారితో పాటు ‘నా సామిరంగ’ హీరోయిన్ ఆషికా, డైరెక్టర్ బిన్ని కూడా వచ్చారు. వారిని కంటెస్టెంట్స్‌కు పరిచయం చేసిన అనంతరం రూ. 15 లక్షల రూపాయల మనీతో ఉన్న సూట్‌కేస్‌ను అల్లరి నరేష్, రాజ్‌తరుణ్‌లకు ఇచ్చి హౌస్‌లోకి పంపించారు కింగ్ నాగ్. హౌస్‌లోకి వెళ్లిన వారిద్దరూ కాసేపు కామెడీ చేసి.. నలుగురిలో ఒకరు ఆ అమౌంట్ తీసుకునేలా డిస్కషన్స్ కొనసాగించారు. చివరికి టెంప్ట్ అయిన యావర్.. ఆ సూట్ కేసు తీసుకుని టాప్ 4 కంటెస్టెంట్‌గా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.


ఇవి కూడా చదవండి:

====================

*Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 6 కంటెస్టెంట్స్‌ నుండి అర్జున్ అవుట్..

*******************************

*Mr Bachchan: రవితేజ, హరీష్ శంకర్.. ఏందయ్యో ఈ స్పీడ్.. అప్పుడే క్లాప్ కూడా!

**********************************

*Sumaya: ‘డియర్ ఉమ’‌తో మల్టీ టాలెంట్‌ ప్రదర్శించబోతోన్న అనంతపురం అమ్మాయ్..

************************************

Updated Date - 2023-12-17T22:27:56+05:30 IST