Biggboss 7 Final Hungama : ఫినాలేకు ముందు ఏం జరిగిందంటే

ABN , First Publish Date - 2023-12-17T08:33:21+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్  7 ఆదివారంతో ముగియనుంది. మరి కొన్ని గంటల్లో బిగ్‌బాస్‌ ఫినాలే జరగనుంది. ఎవరు విన్నర్‌, ఎవరు రన్నర్‌? అనేది తెలుసుకోవడం కోసం షో వీక్షకులు, ఇంటి సభ్యుల కుటుంబాలు, అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు.

Biggboss 7 Final Hungama : ఫినాలేకు ముందు ఏం జరిగిందంటే

బిగ్‌బాస్‌ సీజన్  7 ఆదివారంతో ముగియనుంది. మరి కొన్ని గంటల్లో బిగ్‌బాస్‌ ఫినాలే జరగనుంది. ఎవరు విన్నర్‌, ఎవరు రన్నర్‌? అనేది తెలుసుకోవడం కోసం షో వీక్షకులు, ఇంటి సభ్యుల కుటుంబాలు, అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తుంటారు. ఫినాలే అంటే హడావిడి మామూలుగా ఉండదు. ఇంటి సభ్యుల్లో టెన్షన్  టెన్షన్  వాతావరణం కనిపిస్తుంది. కానీ ఈ సీజన్లో అదేమి కనిపించగా పోగా. నిర్వాహకులు ఏదేదో ప్లాన్  చేశారు. టైమ్‌ పాస్‌ చేస్తున్నారు. చివర్లో సూట్‌కేస్‌తో కాస్త సస్పెన్స్‌ క్రియేట్‌ చేయాలనుకున్నారు . అదీ సక్సెస్‌ కాలేదు. శనివారం ఏం జరిగిందంటే...

చిన్న పిల్లల ఆటలు..

బిగ్‌బాస్‌ -7 చివరి వారం ఇది. నేటితో ఫినాలే పూర్తవుతుంది. విన్నర్‌ ఎవరో తెలుస్తుంది. ఆదివారం ఫైనల్‌ ఎపిసోడ్‌ ఉంది కాబట్టి నాగార్జున శనివారం హోస్ట్‌గా రాలేదు. ఇంట్లో ఉన్న ఆరుగురితోనే టైమ్‌పాస్‌ చేయాలని బిగ్‌బాస్‌.. చిన్నపిల్లల ఆటలన్నీ పెట్టాడు. కళ్లకు గంతలు కట్టుకుని ఎవరు కొట్టారో చెప్పుకోండి చూద్దాం అనే తరహాలో ఓ గేమ్‌ పెట్టాడు. ఆ ఆట అయితే అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లలా యాక్ట్‌ చేసి చూపించాలని బిగ్‌బాస్‌ కొన్ని ఇన్సిడెంట్స్‌ చెప్పాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రైతుబిడ్డ ప్రశాంత్‌, అమర్‌లా యాక్ట్‌ చేసి చూపించిన అర్జున్‌.. అలానే కాఫీ ఇవ్వకపోతే బయటకెళ్లిపోతానంటూ శివాజీ చేేస హడావుడిని రీక్రియేట్‌ చేసిన ప్రియాంక.. ఫుల్‌ మార్కులు కొట్టేశారు. మిగిలిన నలుగురికి ఛాన్స్ రాలేదో, మరి వాళ్లు చేయలేదో అర్థం కాలేదు.

sreemukhi-bb7..jpg

హగ్‌.. అంటూ శ్రీముఖి ఎంట్రీ

త్వరలో ఒక ఓటీటీలో ప్రారంభమయ్యే ‘సూపర్‌ సింగర్‌’ కొత్త సీజన్‌ ప్రమోషన్‌ కోసం హౌసులోకి అడుగుపెట్టింది హాట్‌ యాంకర్‌ శ్రీముఖి.. కాసేపు  ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. పోటీలో ఓడిపోతే హగ్‌. గెలిస్తే పెద్ద హగ్‌ ఇస్తానని మాటిచ్చింది. తర్వాత ‘ట్రూత్‌ ఆర్‌ డేర్‌’ గేమ్‌ ఆడించింది. ఈ ఆటలో భాగంగా శివాజీని శ్రీముఖి ఓ ప్రశ్న అడగ్గా.. బయటకెళ్లిన తర్వాత నయని పవనితో బాండింగ్‌ పెంచుకుంటానని శివాజీ అన్నాడు. రతిక.. ఓసారి ఎలిమినేట్‌ అయి, హౌసులోకి తిరిగొచ్చినా సరే ఇంకా మెచ్యూరిటీ లెవల్స్‌ రాలేదని శివాజీ అన్నాడు. అలానే మరో ప్రశ్నకు బదులిచ్చిన యావర్‌.. అశ్వినిని పెళ్లి చేసుకుంటా, రతికతో డేట్‌కి వెళ్తా, శుభశ్రీని కిల్‌ చేస్తానని సరదాగా చెప్పాడు.

bigg-boss-7-.jpg

సూటుకేస్ ఆఫర్ ...

ప్రతి సీజన్‌లో ఉన్నట్లే ఫినాలేకి ఓ రోజు ముందు హౌసులోకి బిగ్‌బాస్‌ డబ్బుల సూట్‌కేస్‌ పంపించాడు. రూ.3 లక్షల మొత్తంతో వేలం పాట మొదలుపెట్టాడు. ఎవరు తీసుకుంటారంటూ ఒకరి తర్వాత మరొకరికి ఆఫర్‌ ఇచ్చాడు. రూ.3 లక్షల దగ్గర మొదలైన ఈ ఆఫర్‌.. వరసగా రూ.5, 8, 10 లక్షలకు చేరింది. కానీ ఎవరు తీసుకోవడానికి ఆసక్తి కనబర్చలేదు. ఈ మొత్తం మంచి టెంప్టింగ్‌గా ఉన్నప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే ఈ వేలంపాట జరుగుతున్నప్పుడు మధ్యలో శివాజీ.. అర్జున్‌, అమర్‌తో చిన్న పిచ్చి చర్చ పెట్టాడు. ఎంత కావాలి? ఎంత కావాలి? అని అన్నాడు. తనకు రూ.40 లక్షలిస్తే పోతానని అర్జున్‌.. రూ.45 లక్షలైతే వెళ్లిపోతానని అమర్‌ అన్నాడు. ఇక చివరగా ప్రియాంకకు ఇంటి నుంచి ఫుడ్‌ రావడంతో శనివారం ఎపిసోడ్‌ ముగిసింది.

Updated Date - 2023-12-17T09:07:21+05:30 IST