Biggboss : బిగ్‌బాస్‌ విజేతలు ఏం చేస్తున్నారు!

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:43 PM

తెలుగులో బిగ్‌బాస్‌ సీజన్ మొదలై ఏడేళ్లు అవుతుంది. బుల్లితెర వీక్షకుల్ని ఎంతగానో అలరించిన ఈ షో సీజన్ సీజన్ కు ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ ఆదివారంతో బిగ్‌బాస్‌ సీజన్-7కు ముగింపు పలికారు.

Biggboss : బిగ్‌బాస్‌ విజేతలు ఏం చేస్తున్నారు!

తెలుగులో బిగ్‌బాస్‌ సీజన్ మొదలై ఏడేళ్లు (Biggboss winner) అవుతుంది. బుల్లితెర వీక్షకుల్ని ఎంతగానో అలరించిన ఈ షో సీజన్ సీజన్ కు ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ ఆదివారంతో బిగ్‌బాస్‌ సీజన్-7కు ముగింపు పలికారు. 105 రోజులపాటు జరిగిన ఈ షోలో ఇంటి సభ్యులు తమదైన శైలి ఆటను ఆడారు. ఆదివారం ఏడో సీజన్ గ్రాండ్‌ ఫినాలే జరిగింది. విజేతగా పల్లవి ప్రశాంత్ టైటిల్‌ గెలుచుకున్నారు. అయితే ఇంతకు ముందు జరిగిన ఆరు సీజన్ల విజేతలు ఇప్పుడేం చేస్తున్నారు. ఈ షో వాళ్లకు ఎంత వరకూ కలిసొచ్చింది అన్నది చూద్దాం...

అంతేం కలిసి రాలేదు..

శివబాలాజీ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌లో నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఆడపాదడపా హీరోగా కూడా నటించారు. నటుడిగా ఆయనకు మంచి పేరే ఉంది. కాలక్రమేణా సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. ఆ సమయంలో బిగ్‌బాస్‌ అవకాశం వచ్చింది, తనదైన శైలి ఆటతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. మంచి ఓటింగ్‌ రరావడంతో గెలిచి బిగ్‌బాస్‌ టైటిల్‌ అందుకున్నాడు. అయితే బిగ్‌బాస్‌ నుంచి బయటకు వెళ్లాక ఆయన కెరీర్‌లో పెద్ద మార్పు ఏమీ రాలేదు. బిగ్‌బా్‌స్‌కు ముందు ఇంతో అంతో ఫాలోయింగ్‌ ఉండేది. దీని తర్వాత ఆయన అంతగా పాపులర్‌ ఏమీ కాలేదు. ఓ మాటలో చెప్పాలంటే కనిపించకుండా పోయాడు అనొచ్చు. టాలీవుడ్‌లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్‌ నుంచి పోటీ చేసి గెలిచాడు. ప్రస్తుతం 'మా’కు ట్రెజరర్‌గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడూ తన భార్య మధుమిత ప్రారంభించిన యూట్యూబ్‌ ఛానల్‌లో కనిపిస్తుంటారు. ప్రస్తుతం తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారాలతో బిజీగా ఉన్నారని టాక్‌.

Shiva bala.jpg

ఆర్మీ హడావిడి చేసింది.. ఫలితం శూన్యం...

బిగ్‌బాస్‌ సీజన్లో చెప్పుకోదగ్గది రెండో సీజన్. కౌశల్‌ మందా విజేతగా నిలిచాడు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు అవకాశాలు అందుకుంటూ విలనగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తుండేవాడు. అయితే తెలుగులో ఏడేళ్ల బిగ్‌బాస్‌ హిస్టరీ చూసుకుంటే కౌశల్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఈ సీజన్లో ఈయన చేసిన హంగామా, హడావిడి ఏ కంటెస్టెంట్‌ చేయలేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చేముందే.. బయట తనకంటూ పీఆర్‌ను సెట్‌ చేసుకుని.. కౌశల్‌ ఆర్మీగా దాన్ని పెంచి.. తెగ హడావిడి చేశాడు. హౌస్‌లో తనను వేరు చేస్తున్నారు అన్న సింపతీని బాగా క్యాష్‌ చేసుకుని ఓట్లు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తాను పీపుల్‌స్టార్‌గా ప్రకటించుకుని.. ట్రోలింగ్‌కు గురయ్యాడు కౌశల్‌. స్టార్‌గా ఎదగాలని ప్రయత్నించిన అతనికి.. చిన్న చిన్న షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్స్‌, సోషల్‌ మీడియా హడావిడి తప్ప ఏమీ కలిసిరాలేదు. అంతే కాదు.. అంతకు ముందు వచ్చిన క్యారెక్టర్‌ రోల్స్‌ కూడా రాలేదు. ఈ మధ్యన అయితే అతని అడ్రసే తెలియడం లేదు.

Kaushl.jpg

గల్లీ గణేష్‌ టు ఆస్కార్‌...

గల్లీ గణేష్‌ వంటి మ్యూజిక్‌ ఆల్బమ్స్‌తో పాపులర్‌ అయ్యాడు పాత బస్తీ కుర్రాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. తదుపరి సంగీత రంగంలో అడుగుపెట్టి సినిమాల్లో గుర్తుండిపోయే పాటలు పాడాడు. బిగ్‌బాస్‌ సీజన 3లో అవకాశం అందుకున్నాడు. అప్పటికే సింగర్‌గా తనకి మంచి క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌, తన ఆట తీరుతో మూడో సీజన్‌ విజేతగా నిలిచాడు. తను అయితే ప్రస్తుతం వార్తల్లో ఉన్నాడు. రెండు మూడు సినిమాల్లో ఆర్టిస్ట్‌గా అవకాశం అందుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ 'నాటు నాటు’ పాటతో పాపులర్‌ అయ్యాడు. ఆస్కార్‌ వేదికపై ఆ పాటను ప్రదర్శించి రికార్డుకి ఎక్కాడు. బిగ్‌బాస్‌ విజేతల్లో ఎక్కువ లాభ పడింది మాత్రం రాహుల్‌ అనే చెప్పాలి. ఓ ఇల్లు కొన్నాడు, నచ్చిన కారుకొన్నాడు. సింగర్‌గా అతని కెరీర్‌ బావుంది.

Rahul.jpg

ఫలించలేదు...

శేఖర్‌ కమ్ముల లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రంతో టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అయ్యాడు. విజయ్‌ దేవరకొండ కన్నా ముందే ఇండస్ట్రీ వచ్చాడు. అయితే కాలం కలిసి రాలేదు. రెండు మూడు చిత్రాలకే ఫేడ్‌ అవుట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌లో అవకాశం రావండతోపాటు తన క్యారెక్టర్‌తో అందరిని ఇంప్రెస్‌ చేశాడు. సినిమాల ద్వారా సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్‌తో ఇండస్ట్రీ లో ఎదగాలనుకున్నాడు కానీ అంతగా ఫలించినట్లు కనిపించలేదు. ఎందుకుంటే బిగ్‌ బాస్‌ తరువాత అతను వరల్డ్‌ టూర్లు వేశాడు. హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. ట్రావెలర్‌గా మారి.. దేశాలు చుట్టి వస్తున్నాడు. సినిమా అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు.

Abhijith.jpg

బిగ్‌బాస్‌తో కొత్తగా వచ్చిందేం లేదు..

వీజేగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు వీజే సన్నీ.బిగ్‌బాస్‌ సీజన 5లో అవకాశం దక్కించుకున్నాడు. మైండ్‌ గేమ్‌ ఆడుతూ.. ఎవరికీ అంత ఈజీగా దొరకకుండా జాగ్రత్తగా నెట్టుకొచ్చాడు. చిన్న స్థాయి నుంచి.. బిగ్‌ బాస్‌ విన్నర్‌ వరకూ ఎదిగిన సన్నీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్నారు సన్నీ. ఫినాలేలో ఓటింగ్‌ పరంగా దాదాపు 50 శాతం ఆయనకు పడినట్లు సమాచారం. సన్నీకి బిగ్‌ బాస్‌ 5 టైటిల్‌ ట్రోపీతో పాటు 50 లక్షల క్యాష్‌ ప్రైజ్‌, షాద్‌నగర్‌లో సువర్ణభూమి నుంచి 25 లక్షలు విలువ చేసే ఫ్లాట్‌ ఓ టీవీయస్‌ బైక్‌ గెలిచారు. అయితే కెరీర్‌ పరంగా మాత్రం సన్నీ హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. స్టార్‌గా మారి గుర్తింపు తెచ్చుకోవాలని పట్టుదలతో ముందుకెళ్తున్నాడు.

Vj.jpg

బిగ్‌బాస్‌తో కొత్తగా  వచ్చిందేం లేదు...

టాలీవుడ్‌ సింగర్‌గా రేవంత అందరికీ సుపరిచితమే! చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు అనుభవించిన రేవంత క్యాటరింగ్‌ సర్వీస్‌లో బాయ్‌గా పనిచేస్తూ చదవుకుంటూ, సంగీతం నేర్చుకుని టాలీవుడ్‌లో పలు పోటీల్లో పాల్గొని గాయకుడు అయ్యాడు. సింగర్‌గా అతనికున్న ఇమేజ్‌తో సోనీ టీవీలో నిర్వహించిన ఇండియన్‌ ఐడల్‌ 9 విజేతగా నిలిచాడు. బాహుబలిలో మనోహరి పాటతో మరింత ఫేమస్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌లోకి రాకముందే రేవంతకు మంచి ఫేమ్‌, ఫాలోయింగ్‌ ఉంది. అలా బిగ్‌బాస్‌లో అవకాశం దక్కించుకున్నాడు. బిగ్‌బాస్‌ 6 విజేతగా టైటిల్‌ అందుకున్నాడు. అయితే అప్పటికే సింగర్‌గా, ఇండియన ఐడల్‌ విన్నర్‌గా పాపులర్‌ అయిన రేవంతకి బిగ్‌బాస్‌ వచ్చిన ఫేం ఏం లేదు. పాటల అవకాశాల విషయంలో కూడా పెద్ద ఒరిగిందేమీదు. బిగ్‌బాస్‌ విజేతగా రేవంత్‌కు రూ .10 లక్షలతోపాటు సువర్ణభూమి డెవలపర్స్‌ ద్వారా 650 గజాల ప్లాట్‌ పొందాడు. మొత్తం మీద రేవర్‌కి కోటి పుట్టినట్టే. అసలు ఆ సీజనకు శ్రీహాన విజేత అయినా 40 లక్షల క్యాష్‌ తీసుకుని వెనక్కి తగ్గడంతో.. ఈ అవకాశం రన్నర్‌గా ఉన్న రేవంత్‌ను వరించింది.

Revanth.jpg

ఏ మేరకో చూడాలి...

రైతు బిడ్డగా బిగ్‌బాస్‌  సీజన్ 7లో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. అమాయకత్వంగా ఉంటూనే ఇంటెలిజెంట్‌గా ఆట ఆడాడు. సామాన్య కుటుంబ నుంచి వచ్చిన ఆయన టైటిల్‌ కొట్టాలనే టార్గెట్‌ను రీచ్  అయ్యాడు. నిజాయతీగా ఆడి టైటిల్‌ను కొట్టాడు. రైతు బిడ్డ అనే ట్యాగ్‌ అతనికి ఎంతో ఉపయోగపడింది. మరి ఇప్పుడు బిగ్‌బాస్‌ ట్యాగ్‌ అతనికి ఎంతగా ఉపయోగపడుతుందో చూడాలి.

pallavi.jpg

తాజాగా జరిగిన ఏడవ సీజన్ మినహా మిగతా ఆరు సీజన్లు ఎవరికి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. హౌస్‌లోకి వెళ్లొచ్చిన కొందరైతే అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి.

Updated Date - Dec 18 , 2023 | 03:05 PM