Bro - Spoof: తకిట తకిటత 24.. సంక్రాంతి సంబరాన్ని దించేశారు!

ABN , First Publish Date - 2023-07-28T13:25:53+05:30 IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర దాటింది. ఆయన నటించిన గత చిత్రం ‘భీమ్లానాయక్‌’ గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అభిమానులు ఆయన చిత్రం గురించి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ శుక్రవారం ‘బ్రో’ (Bro) చిత్రం విడుదలైంది. సినిమాలో ఫిలాసఫీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు పొలిటికల్‌ పంచ్‌లు కూడా బాగానే ఉన్నాయంటున్నారు నెటిజన్లు. అంతే కాదు కొన్ని స్పూఫ్‌లు కూడా ఉన్నాయట.

Bro - Spoof: తకిట తకిటత 24.. సంక్రాంతి సంబరాన్ని దించేశారు!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర దాటింది. ఆయన నటించిన గత చిత్రం ‘భీమ్లానాయక్‌’ గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అభిమానులు ఆయన చిత్రం గురించి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ శుక్రవారం ‘బ్రో’ (Bro) చిత్రం విడుదలైంది. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసిన నటించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. మార్నింగ్‌ షో నుంచి సినిమా పాజిటివ్‌ టాక్‌తో నడుస్తోంది. పవన్‌కల్యాణ్‌ పవర్‌ ప్యాక్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌ అని, పవన్‌ వన్‌మెన్‌ షో అని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమాలో ఫిలాసఫీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు పొలిటికల్‌ పంచ్‌లు కూడా బాగానే ఉన్నాయంటున్నారు నెటిజన్లు. అంతే కాదు కొన్ని స్పూఫ్‌లు కూడా ఉన్నాయట.

సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Sambarala rambabu) వేసిన డాన్స్‌ ఈ చిత్రంలో కూడా ఉన్నాయట. ఆ పాత్రను ఈ చిత్రంలో శ్యాంబాబు పేరుతో 30 ఇయర్స్‌ పృథ్వీ (30 Years Pruthvi) పోషించారు. సంక్రాంతి సంబరాల్లో అంబటి ఎలాగైతే డాన్స్‌ చేశారో, ఎలాంటి దుస్తులు ధరించారో అదే మేకోవర్‌తో పృథ్వీ ఈ చిత్రంలో కనిపించారు. పబ్‌లో ఓ హుషారైన పాటకు డాన్స్‌ చేస్తున్న పృథ్వీని పవన్‌కల్యాణ్‌ ఆపి ‘శ్యాంబాబు ఆ డాన్స్‌ ఏంటి? వస్తున్న టెంపో ఏంటి? నువ్వు చేస్తున్న స్టెప్‌ ఏంటి? తకిటతకిటత 68, తకదిమితకదిమిత 24 అంటూ చేసిన సన్నివేశం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతే కాదు... నెటిజన్లు ఆ సన్నివేశాన్ని.. సంక్రాంతిలో మంత్రి చేసిన డాన్స్‌ వీడియోను క్లబ్‌ చేసిన సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై విపరీతంగా మీమ్స్‌ క్రియేట్‌ అయ్యి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Updated Date - 2023-07-28T13:31:56+05:30 IST