Liger: ఆగని వివాదం.. ధర్నాకు దిగిన బాధితులు.. ఛార్మీ సమాధానమిదే!

ABN , First Publish Date - 2023-05-12T17:43:22+05:30 IST

పూరి తన తదుపరి ప్రాజెక్ట్‌ని మొదలు పెట్టేందుకు రెడీ అవుతుండటంతో.. ఇదే సరైన టైమ్ అని భావించిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారు. దీంతో..

Liger: ఆగని వివాదం.. ధర్నాకు దిగిన బాధితులు.. ఛార్మీ సమాధానమిదే!
Liger Exhibitors Protest

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో చేసిన ‘లైగర్’ (Liger) చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌గా తన సత్తా చాటాలని చూసిన పూరీ జగన్నాధ్‌ (Puri Jagannadh)కు ఆ చిత్రం.. ఇప్పటికీ ఓ పీడకలగానే మారింది. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ఎన్నో ఆశలతో, అంచనాలతో ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ సినిమా.. సినిమాలోని హీరో పాత్రలానే.. ప్రేక్షకులకి మాటలు లేకుండా చేసింది. ఇక ఎగ్జిబిటర్స్‌ని అయితే రోడ్డున పడేలా చేసింది. ఈ సినిమాని కొన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు భారీగా నష్టపోయారు. సినిమా విడుదల తర్వాత వచ్చిన టాక్‌తో.. అందరినీ ఆదుకుంటానని పూరి జగన్నాధ్ ముందే స్టేట్‌మెంట్ ఇచ్చారు.. కానీ ఆ తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటూ రివర్స్ అయ్యారు. ఆ తర్వాత ఎలాగోలా విషయాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. కొన్నాళ్లుగా ఈ విషయం కామ్‌గానే ఉంది. ఇప్పుడు పూరి తన తదుపరి ప్రాజెక్ట్‌ని మొదలు పెట్టేందుకు రెడీ అవుతుండటంతో.. ఇదే సరైన టైమ్ అని భావించిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారు.

‘లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయండి. రిలే నిరవధిక దీక్షలు. 12-5-2023 నుంచి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్’ అనే బ్యానర్లతో.. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట.. ఈ సినిమాని కొన్నవారంతా ధర్నాకు దిగారు. దీంతో మరోసారి ‘లైగర్’ (Liger) సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది. పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ వచ్చి మాకు న్యాయం చేయాలి. రూ. 9 కోట్లు ఇవ్వాలి.. లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటూ.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సినిమాను కొన్నవారు దీక్షకు దిగారు. దీంతో ఇప్పుడీ బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC) పెద్దలు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

Liger-Movie.jpg

‘లైగర్’ బాధితులు చేస్తున్న ధర్నాకు సంబంధించి.. సమస్యను పరిష్కరించేందుకు తెలుగు నిర్మాతల మండలి పెద్దలు.. పూరి, ఛార్మీలతో మాట్లాడినట్లుగా సమాచారం. అనంతరం తెలుగు నిర్మాతల మండలికి ఛార్మీ కౌర్ (Charmy Kaur) ఓ మెసేజ్ కూడా చేసిందనేలా టాక్ వినిపిస్తోంది. ఈ సమస్యని తమ దృష్టికి తీసుకువచ్చిన తెలుగు నిర్మాతల మండలికి ఆమె ధన్యవాదాలు తెలుపుతూ.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఛార్మీ తన మెసేజ్‌లో తెలిపిందట. కాగా.. ‘లైగర్’ సినిమా నిర్మాణంలో ఛార్మీ కూడా ఓ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఛార్మీ మెసేజ్‌తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న ఆ అమౌంట్‌ని వాళ్లు తిరిగి ఇస్తారా? మే 15న పూరి, రామ్ (Puri and Ram Combo Film) కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా ప్రారంభం అవుతుందా? అనే ఆసక్తి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. వేచి చూడాల్సిందే. (Liger Controversy)

ఇవి చదవండి:

************************************************

*Shaakuntalam: చెప్పిన టైమ్ కంటే ఒక రోజు ముందే.. ఓటీటీలోకి వచ్చేసింది

*Naresh: ట్రైలర్.. జస్ట్ మచ్చు తునక మాత్రమే! నా బయోపిక్ కాదు

*Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి

*Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది

*Poonam Kaur: ‘ఉస్తాద్’‌ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్

*Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?

*Kushboo: పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. ‘కేరళ స్టోరీ’ విమర్శలపై ధీటైన సమాధానం

*NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు

*Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..

Updated Date - 2023-05-12T17:43:22+05:30 IST