Director Teja: బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే!
ABN , First Publish Date - 2023-04-29T20:07:54+05:30 IST
బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే! అంటూ తేజ అద్భుతంగా వివరణ ఇచ్చారు. తేజ ఏం చెప్పారంటే..
బాలీవుడ్ (Bollywood) సినిమాని చంపింది.. టాలీవుడ్ (Tollywood) సినిమాని చంపబోతోందీ.. ఏమిటో.. డైరెక్టర్ తేజ (Director Teja) తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామబాణం’ (Rama Banam). ఈ సినిమా మే 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సందర్భంగా హీరో గోపీచంద్‌ను డైరెక్టర్ తేజ ఇంటర్వ్యూ చేశారు. ‘రామబాణం’ చిత్ర ప్రమోషన్లో భాగంగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో తేజ అనేక విషయాలను చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు బాలీవుడ్లో సినిమా పరిస్థితి అలా అయిపోవడానికి కారణం ఏమిటో? అలాగే రాబోయే రోజుల్లో టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అనే దానిపై తేజ వివరించిన తీరుకు అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇంతకీ తేజ ఏం చెప్పారంటే..
‘‘సినిమా థియేటర్‌కి వెళితే.. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న అతి పెద్ద కంప్లయింట్.. పాప్‌కార్న్ రేటు భయంకరంగా ఉంది. కోక్ రేటు భయంకరంగా ఉంది. నా వల్ల కావడం లేదు. నేనే కాదు.. కామన్‌మ్యాన్ అసలు భరించలేడు. ఈ మల్టీఫ్లెక్సెస్లో ఉండే రేట్లు టుమచ్గా ఉన్నాయి. వాళ్లు చంపేయగలరు మన సినిమాని. మల్టీఫ్లెక్స్‌లో పాప్‌కార్న్ (Pop Corn) అమ్ముకునేవాళ్లు, రేటు.. సినిమాని చంపేసిద్ది. ఖచ్చితంగా చంపేస్తది. ఓటీటీ, టీవీ ఇవేవీ సినిమాని చంపలేవు. ఎందుకంటే.. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. భర్త, భార్య, ఇద్దరు పిల్లలు బైక్‌పై వెళ్లి.. పార్కింగ్ ఫీజు రూ. 50 కట్టి.. థియేటర్లోకి వెళ్లి కూర్చుని సినిమా చూసేటప్పుడు.. పాప్‌కార్న్ తింటూ సినిమా.. సమోసా తింటూ సినిమా.. కోక్ తాగుతూ సినిమాని ఎంజాయ్ చేయడం అలవాటు. ఇది రేటు ఎక్కువైపోయిందనుకోండి.. వెళ్లడం మానేస్తారు. (Teja About Theater Cinema)
ఇప్పుడు బొంబేలో సినిమా చచ్చిపోవడానికి కారణం ఓటీటీలు కాదు. మల్టీఫ్లెక్స్‌లలో (Multiplex Theaters) అమ్మే ఆ పాప్‌కార్న్ రేటే హిందీ సినిమా (Bollywood)ని చంపేసింది. తెలుగులో మనకి ఎక్కువ సింగిల్ స్ర్కీన్స్ ఉండటం కారణంగా చంపలేకపోతున్నారు. నేను అందరికీ రికమెండ్ చేసేది ఏమిటంటే.. అందరూ సింగిల్ స్ర్కీన్ థియేటర్లకి వెళ్లండి. అందులో చూడండి. అక్కడ సినిమా పెద్ద బొమ్మ ఉంటుంది. చాలా మల్టీఫ్లెక్స్‌లలో స్ర్కీన్స్ చిన్నవి అయిపోతున్నాయి. ఇప్పుడొస్తున్న టీవీల కంటే కొంచెం పెద్దగా ఉంటున్నాయి అంతే. ఇప్పుడు తెలుగులో కూడా సింగిల్ స్ర్కీన్స్ తీసేసి మల్టీఫ్లెక్స్‌లు చేస్తున్నారు. మల్టీఫ్లెక్స్‌లు ఎక్కువైన ఏరియాలలో సినిమా చచ్చిపోతుంది. పాప్‌కార్న్ లేకుండా సినిమాని ఊహించుకోలేం. నాకు తింటూ సినిమా చూడటం అలవాటు.. అదే అసలు ఎంటర్టైన్మెంట్. దానిని చంపేస్తే ఎలా? ఫైనల్‌గా నేను చెప్పేది ఏమిటంటే.. ఓటీటీలు, టీవీలు ఎప్పటికీ సినిమాని చంపలేవు. పాప్‌కార్న్ చంపగలదు (Popcorn Kills Cinema)’’ అని తేజ చెప్పుకొచ్చారు. దీనికి ప్రేక్షకులు కూడా ‘నిజం చెప్పారు సార్.. ఇట్స్ ట్రు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Nani 30: ‘నాని 30’లో చిరు, బాలయ్య సినిమాల్లో చేసిన హీరోయిన్
*Bichagadu 2 Trailer Talk: మరో బ్లాక్‌బస్టర్.. ఆన్ ద వే!
*Ravanasura: రవితేజ.. చెప్పా పెట్టకుండా వచ్చేశాడేంటి?
*Trisha: అసలు ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఏ రోల్ కోరిందో తెలుసా..?
*RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?