Ram Charan: ముంబైలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-05-15T13:53:29+05:30 IST

మెగా పవర్ స్టార్ అభిమానులు ఏం చేశారని అనుకుంటున్నారా?.. ముంబై అంధేరి, భీవండి, జుహూలోని శంకర్‌ ఆలయం (Shankar Temple in Juhu) పరిసరాల్లో

Ram Charan: ముంబైలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం చేశారంటే..
Global Star Ram Charan Fans

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Global Star Ram Charan) అభిమానులు మండు వేసవిలో చేసిన చల్లటి కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇంతకీ ఈ మెగా పవర్ స్టార్ అభిమానులు ఏం చేశారని అనుకుంటున్నారా?.. ముంబై అంధేరి, భీవండి, జుహూలోని శంకర్‌ ఆలయం (Shankar Temple in Juhu) పరిసరాల్లో దాదాపు 1000 మంది రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ (Ram Charan Fans) సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవి తాపాన్ని తీర్చడానికి దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ (Buttermilk) బాటిల్స్ పంచారు. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందిన అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Ram-charan.jpg

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Mega Power Star Ram Charan) అనగానే సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆయన గ్రేస్‌ ఎంత గొప్పగా గుర్తుకొస్తుందో, సొసైటీకి ఆయన చేసే సేవలు కూడా అంతే ఘనంగా మదిలో మెదులుతాయి. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీఓల ద్వారా, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్ (The Chiranjeevi Charitable Trust) ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్‌ ఆపత్కాలంలో పలు రకాల సహాయాలు అందిస్తూనే ఉన్నారు. ఆపన్నులను పలు రకాలుగా ఆదుకుంటూనే ఉన్నారు. అవన్నీ ప్రత్యక్షంగా గమనిస్తున్న అభిమానులు సమాజానికి హితోధికంగా సాయపడాలని ముందుకొచ్చారు.

Ram-Charan-2.jpg

తమ స్టార్‌లాగానే తాము కూడా సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని.. దయ, కరుణతో వ్యవహరించాలని, నలుగురిలోనూ స్ఫూర్తిపంచాలన్న ధ్యేయంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మజ్జిగ పంచడం అనేది తమకు వచ్చిన ఆలోచనకు ఒక రూపం మాత్రమేనని అన్నారు. సమాజంలో సాటి వ్యక్తుల పట్ల సానుకూల దృక్పథం పెరగాలంటే, కచ్చితంగా తమవంతు సాయాన్ని ప్రతి ఒక్కరూ చేయాలనే ఉద్దేశాన్ని పంచుకున్నారు. ఈ నెల 6న ముంబై (Mumbai)లోనూ, ఏప్రిల్‌ 29న షోలాపూర్‌ (Solapur)లోనూ ఈ మజ్జిక పంపిణీ & అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మండు వేసవికి మంచితనంతో, మజ్జిగతోనూ చెక్‌ పెడుతున్నారు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు. దీనిని ‘హార్ట్ వార్మింగ్‌’ (HEARTWARMING) అని సవినయంగా చెబుతున్నారు చరణ్‌ సైన్యం.

ఇవి కూడా చదవండి:

************************************************

*Krithi Shetty: కాబోయేవాడు కాస్త బొద్దుగా ఉండాలి..

*Ustaad Bhagat Singh: బాబాయ్ మూవీ గ్లింప్స్‌పై అబ్బాయ్ రియాక్షన్ ఇదే..

*Bandla Ganesh: బానిసత్వానికి భాయ్ భాయ్.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..

*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Updated Date - 2023-05-15T13:53:29+05:30 IST