Vikram film postponed: ఈరోజు విడుదలవ్వాల్సిన 'ధృవ నక్షత్రం' మళ్ళీ వాయిదా

ABN , First Publish Date - 2023-11-24T06:12:36+05:30 IST

తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలంటే తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ వుంటారు. అతను విక్రమ్ తో గత ఐదు సమత్సరాలుగా తీసిన 'ధృవ నక్షత్రం' ఈరోజు విడుదల కావాల్సి వుంది, కానీ మళ్ళీ వాయిందా వేసినట్టుగా గౌతమ్ ఈరోజు తెల్లవారుజామున ప్రకటించారు.

Vikram film postponed: ఈరోజు విడుదలవ్వాల్సిన 'ధృవ నక్షత్రం' మళ్ళీ వాయిదా
Dhruva Nakshathram release is postponed once again

తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (GauthamVasudevMenon) 'ధృవ నక్షత్రం' #DhruvaNakshathram అనే సినిమాని విక్రమ్ (ChiyaanVikram) తో కొన్ని సంవత్సరాల ముందు మొదలెట్టారు. అయితే ఆర్ధిక ఇబ్బందులు రావటంతో ఆ సినిమా నత్త నడకలా సాగింది. సుమారు ఒక ఐదేళ్ల పాటు ఆ సినిమా షూటింగ్ జరిగి, ఈరోజు నవంబర్ 24న విడుదలవుతుందని దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రకటించారు. పోనీలే మొత్తానికి సినిమా విడుదలవుతోంది అని విక్రమ్ అభిమానులు అనుకున్నారు. అదీ కాకుండా ఈ సినిమాకి ప్రచారాలు కూడా పెద్దగా ఏమీ నిర్వహించలేదు. కానీ గౌతమ్ మీనన్ సినిమాలు అంటే చూసే ప్రేక్షకులు అటు తమిళంలో, ఇటు తెలుగులో చాలామంది వున్నారు. అలాగే విక్రమ్ కి కూడా తెలుగులో అభిమానులు వున్నారు.

Vikram.jpg

కానీ, ఈరోజు విడుదలవ్వాల్సిన ఈ 'ధృవ నక్షత్రం' మళ్ళీ వాయిదా పడింది. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకుడు, నిర్మాత అయిన గౌతమ్ మీనన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. (Gautham Vasudev Menon again postponed his Dhruva Nakshathram film) నవంబర్ 24న ఈ సినిమా విడుదలవ్వాల్సి వుంది, కానీ ఈరోజు తెల్లవారుజామున గౌతమ్ ఒక ప్రకటన చేస్తూ, "ఈరోజు 'ధృవ నక్షత్రం' సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాలేకపోయినందుకు క్షమించండి. మాకు ఇంకో ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో వచ్చేస్తాము, మీకు ఈ సినిమా అనుభూతిని మంచి థియేటర్స్ లో చూపిస్తాము," అని చెప్పాడు.

ఈ సినిమాకి తమిళంలో 'ధృవ నచ్చతిరం' అని పెట్టారు. అయితే ముందుగా ఇది రెండు భాగాలుగా విడుదల తీయాలని అనుకున్నారు. కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన ఈ సినిమా చాలా ఆలసయం అయింది, అందుకే సుమారు ఐదేళ్లు పట్టింది వెలుగు చూడటానికి. ఇటీవల ఈ చిత్ర నిర్వాహకులు “ట్రైల్ బ్లేజర్” పేరుతో ఒక చిన్న ప్రోమోను విడుదల చేసారు, అది వైరల్ కూడా అయింది. ఇందులో పోరాట సన్నివేశాలు చాలా బాగున్నాయని కూడా అందరూ అన్నారు. ఈ సినిమాలో జాన్‌గా విక్రమ్ నటిస్తున్నాడు. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

ఈ సినిమా U/A సెన్సార్ సర్టిఫికేట్‌ను కూడా ఈమధ్యనే పొందింది. రీతూ వర్మ (RituVarma), పార్తిబన్, ఐశ్వర్య రాజేష్ (AishwaryaRajesh), సిమ్రాన్ (Simran), రాధిక, అర్జున్ దాస్ (Arjun Das), దివ్యదర్శిని కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ (HarrisJayaraj) సంగీతం సమకూర్చాడు.

Updated Date - 2023-11-24T06:12:39+05:30 IST