Hiranyakashyap: దేవుడనేవాడు ఉన్నాడు.. చూసుకుంటాడు.. రానాపై గుణశేఖర్ గుర్రు
ABN , First Publish Date - 2023-07-20T15:59:34+05:30 IST
డైరెక్టర్ గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశ్యప’ చేతులు మారిందా? అంటే.. తాజాగా వచ్చిన పోస్టర్‌తో అదే వెల్లడవుతోంది. బుధవారం డైరెక్టర్ పేరు లేకుండా ‘హిరణ్యకశ్యప’కు సంబంధించి ఓ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. దీనిని చూసిన గుణశేఖర్.. రానాని టార్గెట్ చేస్తూ ఇన్‌డైరెక్ట్‌గా ఫైర్ అయ్యారు. దేవుడనేవాడు ఉన్నాడు.. చూసుకుంటాడు.. అనేలా గుణశేఖర్ ఓ ట్వీట్ చేశారు.
డైరెక్టర్ గుణశేఖర్ (Guna Sekhar) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశ్యప’ (Hiranyakashyap) చేతులు మారిందా? అంటే.. తాజాగా వచ్చిన పోస్టర్‌తో అదే వెల్లడవుతోంది. బుధవారం డైరెక్టర్ పేరు లేకుండా ‘హిరణ్యకశ్యప’కు సంబంధించి ఓ పోస్టర్‌ని రానా దగ్గుబాటి (Rana Daggubati) విడుదల చేశారు. ఇందులో ఈ సినిమాకు కథ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అందిస్తారంటూ తెలియజేశారు. అదేంటి? గుణశేఖర్ కథ రెడీగా ఉందని గతంలో చెప్పారు కదా.. మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ అంటారేంటి? అనుకుంటున్నారా? అదే ఇప్పుడు వివాదంగా మారింది. ఎందుకంటే.. ఆల్రెడీ రానాతోనే గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలిపారు. ‘శాకుంతలం’ పనుల్లో ఉండటం వల్ల.. ఆ సినిమాని కొంతకాలం పాటు వాయిదా వేస్తున్నట్లుగా ఆ మధ్య చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు సడెన్‌గా దర్శకుడి పేరు లేకుండా పోస్టర్ వదలడంతో.. దీనిపై టాలీవుడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. గుణశేఖర్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా రానాని టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
‘‘దేవుడిని ఇతివృత్తంగా చేసుకుని మీరు స్టోరీ తయారు చేసినప్పుడు.., ఆ దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని మరిచిపోవద్దు. అనైతిక చర్యలకు ఆ దేవుడు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇస్తాడని తెలుసుకోండి’’ అంటూ గుణశేఖర్ ఇన్‌డైరెక్టర్‌గా ‘హిరణ్యకశ్యప’ను ఉద్దేశించి రానాను టార్గెట్ చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఇప్పుడు రానా చేయబోయే ‘హిరణ్యకశ్యప’.. గుణశేఖర్‌తో కాదనేది తెలిసిపోతుంది. అయితే ఇటీవల వచ్చిన ‘శాకుంతలం’ డిజాస్టర్ కావడంతో.. సాహసం చేయలేకే.. రానా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడనేలా కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అయితే.. ఇప్పుడిదొక వివాదంగా మారింది. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ రూపాంతరం చెందే సమయానికి ఈ వివాదం ఇంకెంతగా ముదురుతుందో అనేలా పరిస్థితి మారిపోయింది.
ఇక తాజాగా వదిలిన పోస్టర్‌తో.. రానాకు చెందిన నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా (Spirit Media)లో ఈ సినిమా నిర్మాణం జరుపుకోబోతోంది. మొదటి నుంచి రానా ఎంతో ఆసక్తి కనబరిచే కామిక్ స్టోరీలు ‘అమర్ చిత్ర కథ’ (Amar Chitra Katha) నుంచి తీసుకున్న కథతో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథని సిద్ధం చేసినట్లుగా టాక్ వినబడుతోంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో కామిక్ కాన్ ఈవెంట్ భారీ స్థాయిలో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ‘ప్రాజెక్ట్ K’ యూనిట్‌తో కలిసి రానా కూడా పాల్గొంటున్నారు. ఈ వేదికపై నుంచే రానా దగ్గుబాటి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విశేషాలను తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Rules Ranjann: శ్రేయ ఘోషల్ వాయిస్‌లో ‘సమ్మోహనుడా’.. రొమాంటిక్ సాంగ్ ఎలా ఉందంటే..
**************************************
*Sitara Ghattamaneni: గుర్తు పెట్టుకోండి.. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది
**************************************
*Leo: మైత్రీ మూవీ మేకర్స్ బాటలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫస్ట్ సినిమా ‘లియో’నే!
**************************************
*Bro: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతలు.. ఫ్యాన్స్‌కు నిరాశే ‘బ్రో’!
**************************************
*Klin Kaara: మెగా ప్రిన్సెస్‌కు తారక్ పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఎవరూ ఊహించి కూడా ఉండరు
**************************************