KA Paul and Naveen Polishetty: ఈ ఇద్దరూ ఎలా, ఎక్కడ కలిశారు, ఏమి మాట్లాడుకున్నారు... వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-08-28T14:17:46+05:30 IST

నవీన్ పోలిశెట్టి ఒక విలక్షణమైన నటుడు, అలాగే మొహమాటం లేకుండా మాట్లాడే వ్యక్తి. ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ కూడా తెలియని వారుండరు. మరి ఈ ఇద్దరూ ఎక్కడ, ఎలా కలిసారో, ఆ వీడియో ఎందుకు వైరల్ అయిందో చదవండి...

KA Paul and Naveen Polishetty: ఈ ఇద్దరూ ఎలా, ఎక్కడ కలిశారు, ఏమి మాట్లాడుకున్నారు... వీడియో వైరల్
Naveen Polishetty and KA Paul

యువ నటుడు నవీన్ పోలిశెట్టి (NaveenPolishetty) తన రాబోయే సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' (MissShettyMrPolishetty) సినిమా ప్రచారాలు చాలా ఉదృతంగా చేస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రతి పట్టణం తిరుగుతూ, వీధుల్లో కూడా ప్రేక్షకులని పలకరిస్తూ చాలా ప్రచారం ఒక్కడే చేసుకుంటూ వెళుతున్నాడు. ఇలా చేస్తున్న సమయంలోనే నిన్న రాత్రి విశాఖపట్నం (Visakhapatnam) చేరుకున్నాడు. అక్కడ కూడా తన సినిమా ప్రచారాలు చేస్తూ విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ (RamakrishnaBeach) కి చేరుకున్నాడు.

అతను అక్కడకి చేరుకోగానే ఒక విచిత్ర సంఘటన జరిగింది బీచ్ లో. అదే విశాఖపట్నంలో అదే బీచ్ లో ప్రజాశాంతి పార్టీ (PrajaShanthiParty) వ్యవస్థాపకుడు కెఎ పాల్ (KAPaul) కూడా తన కారులోంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళుతున్నారు. కారులో నిలబడి అక్కడకి వచ్చిన ప్రజలకి తన చెయ్యి కలుపుతూ ఉండగా అప్పుడే అక్కడకి వచ్చిన నటుడు నవీన్ పోలిశెట్టి అతన్ని చూసాడు. చూడగానే ఇద్దరూ తమ వాహనాల్ని ఆపి ఒకరినొకరు చేతులు ఊపుకుంటూ అభివాదం చేసుకున్నారు.

naveenpolishetty-paul1.jpg

ఈ సంఘటన నిన్న రాత్రి వైజాగ్ బీచ్ రోడ్డులోని ఒక సిగ్నల్ వద్ద జరిగింది. కెఏ పాల్ ని చూసి అక్కడున్న ప్రజలు సీఎం అంటూ నినాదాలు చేస్తుండగా, తన తాజా చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ప్రచారం కోసం అక్కడికి నవీన్ సిగ్నల్ వద్ద ఆగాడు. కారులో నుంచి బయటికి వచ్చిన నవీన్ ను చూసిన యువకులంతా కె.ఏ.పాల్ దగ్గరి నుంచి నవీన్ వైపు పరుగులు తీశారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కె.ఏ.పాల్ ను చూసిన ననీన్, తనదైన శైలిలో సమస్కరిస్తూ ముందుకెళ్లడంతో పాల్ ఆశ్చర్యపోయాడు. అభిమానులు తీసిన వీరిద్దరి వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. అనుష్క శెట్టి (AnushkaShetty) ఈ సినిమాలో కథానాయిక.

Updated Date - 2023-08-28T14:18:20+05:30 IST