Liger: ‘లైగర్’ ఎగ్జిబిటర్స్ దీక్ష విరమించారు.. ఎందుకో తెలుసా?
ABN , First Publish Date - 2023-05-18T22:13:22+05:30 IST
ఛార్మీ కలుగజేసుకుని.. అందరికీ న్యాయం చేస్తామని నిర్మాత మండలికి మెసేజ్ పంపినట్లుగా వార్తలు వచ్చాయి. అయినా కూడా వారు దీక్ష విరమింపలేదు. ఈ గ్యాప్‌లో పూరి తన తదుపరి సినిమా ప్రకటనని చేసేశారు. అయితే ఈ సినిమాకు ఎక్కడ ఆటంకం కలిగిస్తారో అని..
పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ (Liger) సినిమాకి సంబంధించి దీక్ష చేస్తున్న ఎగ్జిబిటర్లు గురువారం దీక్ష విరమించారు. గత కొన్ని రోజులుగా ‘లైగర్’ సినిమాకు సంబంధించి తమకు వచ్చిన నష్టానికి పరిహారం చెల్లించాలంటూ.. నైజాం ఎగ్జిబిటర్లు కొందరు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార ధీక్షకు దిగిన విషయం తెలిసిందే. మధ్యలో ఛార్మీ కలుగజేసుకుని.. అందరికీ న్యాయం చేస్తామని నిర్మాత మండలికి మెసేజ్ పంపినట్లుగా వార్తలు వచ్చాయి. అయినా కూడా వారు దీక్ష విరమింపలేదు. ఈ గ్యాప్‌లో పూరి తన తదుపరి సినిమా ప్రకటనని చేసేశారు. అయితే ఈ సినిమాకు ఎక్కడ ఆటంకం కలిగిస్తారో అని.. పూరి, ఛార్మీ ఫిలిం ఛాంబర్ పెద్దల వద్ద రాజీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పూరీ, ఛార్మీ నుంచి స్పష్టమైన హామీ రావడంతో.. నిర్మాతల మండలి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగి.. ఎగ్జిబిటర్ల దీక్షను విరమింపజేశారు. ఎక్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమ రెడ్డి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటర్లు దీక్ష విరమించారు.
అనంతరం ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ.. ‘లైగర్’ నిర్మాతలైన పూరీ జగన్నాథ్, ఛార్మీ (Charmi)గార్లు సమస్యను సామరస్యంగా సాల్వ్ చేద్దామని నిర్మాతల మండలికి, అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి తెలపడం, అలాగే మాలోని కొందరు అనారోగ్యం బారిన పడి హాస్పిటల్‌లో అడ్మిట్ అవడం వంటి వన్నీ దృష్టిలో పెట్టుకుని పెద్దలు జరిపిన సంప్రదింపులతో మేము దీక్ష విరమిస్తున్నాము. దీనికి సహకరించిన ప్రసన్నకుమార్‌గారు, సునీల్ నారంగ్‌గారు, దగ్గుబాటి సురేష్‌గారు, శిరీష్‌గారు, మురళీ మోహన్‌గారు, అనుపమ్ రెడ్డి వంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. వీళ్లంతా ఇన్‌వాల్వ్ అవడంతో.. మాకు నమ్మకం వచ్చింది. మా సమస్యలు తీరి, మాకు న్యాయం జరుగుతుందని భావిస్తూ.. దీక్షను విరమిస్తున్నామని తెలిపారు.
అసలేం జరిగిందంటే..
పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. పూరీ, ఛార్మీ కూడా ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పూరీ ఇంటి ముందు ధర్నాకి దిగడానికి సిద్ధమవుతున్న సమయంలో.. నష్టపోయిన అందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని పూరి మాటిచ్చారు. కానీ కొందరు ఎగ్జిబిటర్స్ అతిగా ప్రవర్తించడంతో.. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ఓ వీడియోని విడుదల చేశారు. ఆ తర్వాత కొందరు పెద్దలు రాజీ కుదర్చడంతో.. ఆరు నెలల్లో అన్నీ సెటిల్ చేస్తానని పూరీ, ఛార్మీ తెలిపారు. కానీ ఆ మాట మీద వారు నిలబడలేదు. దీంతో.. వారి తదుపరి సినిమా ప్రారంభం కాబోతున్న సమయంలో.. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆ తర్వాత అంతా తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
************************************************
*Bro: ఫైనల్‌గా ‘PKSDT’ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది
*Mrunal Thakur: వామ్మో.. ఈమె అసలు ‘సీతా రామం’ సీతేనా? ఆ ప్రదర్శన ఏంటసలు?
*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది
*PushpaTheRule: ‘షెకావత్’ అప్‌డేట్ వచ్చింది.. ఈసారి ప్రతీకారం మాములుగా ఉండదట
*Malli Pelli: పాటలోనూ పవిత్రని వదలని నరేష్
*Rakshana: మరో హీరోయిన్‌కు ‘ఆర్’ అక్షరం వచ్చేలా పేరు పెట్టిన దర్శక దిగ్గజం
*Pawan Kalyan OG: వద్దన్నా.. ‘ఓజీ’ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయ్.. ఈసారి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే..