Manchu Lakshmi: నా కష్టం.. నా సంపాదన.. నీకేమిరా నొప్పి?.. మంచు లక్ష్మీ ఫైర్!
ABN , First Publish Date - 2023-09-23T13:48:59+05:30 IST
నా కష్టం.. నా సంపాదన.. నీకెంట్రా నొప్పి.. అంటూ సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మీ ఫైర్ అయ్యారు. రీసెంట్గా ఆమె చేసిన ఓ ట్వీట్‌పై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుండటంతో.. ట్విట్టర్ వేదికగా మంచు లక్ష్మీ ఓ వీడియోని షేర్ చేసి.. ట్రోలర్స్‌కు క్లాస్ ఇచ్చారు.
నా కష్టం.. నా సంపాదన.. నీకెంట్రా నొప్పి.. అంటూ సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మీ ఫైర్ అయ్యారు. రీసెంట్గా ఆమె చేసిన ఓ ట్వీట్‌పై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుండటంతో.. ట్విట్టర్ వేదికగా మంచు లక్ష్మీ ఓ వీడియోని షేర్ చేసి.. ట్రోలర్స్‌కు క్లాస్ ఇచ్చారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్ అపరిశుభ్రంగా ఉండటాన్ని మంచు లక్ష్మీ ఫొటో తీసి.. ఎయిర్ ఇండియాను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ‘‘ముంబైలో ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు బిజినెస్ క్లాస్ వాళ్లు వెళ్లే రూట్లో.. ఏర్పాటు చేసిన కార్పెట్లు శుభ్రంగా లేవు. ఈ విషయాన్ని సిబ్బందికి చెబితే వాళ్లు నవ్వి ఊరుకున్నారు. పరిశుభ్రత ప్రయాణికుల హక్కు. చూడండి.. నా ఐఫోన్ కెమెరా ఇంకా బాగా కనపడేలా చేస్తుంది’’ అంటూ మంచు లక్ష్మీ తన ట్వీట్లో పేర్కొంది. ఈ ట్వీట్‌కు తనపై వస్తున్న ట్రోలింగ్‌ని గమనించిన మంచు లక్ష్మీ.. తాజాగా ఓ వీడియోని ట్విట్టర్లో షేర్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ..
‘‘రీసెంట్గా నేను ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్ శుభ్రంగా లేదని ఓ వీడియో పెట్టాను. నా ఐఫోన్‌తో ఫొటో తీయడంతో అది ఇంకా బాగా కనిపిస్తుంది అని పెట్టాను. అంతే కొందరు వరసబెట్టి ట్రోల్ చేయడం మొదలెట్టారు. చాలా ఆసక్తికరంగా.. ‘ఓ.. నువ్వు బిజినెస్ క్లాస్‌లో వెళ్తున్నావేమో..? ఓ.. నీకు ఐఫోన్ ఉందేమో..’ అంటూ వరసబెట్టి కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారందరినీ అడుగుతున్నా.. ‘నువ్ కొనిచ్చావా.. నాకు? నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేదో నాకు డబ్బులిస్తున్నట్టు..? నేను బిజినెస్ క్లాస్‌లో వెళ్లడం, ఐఫోన్ వాడటం తప్పు అన్నట్లుగా పెద్ద పెద్దగా అరుస్తున్నారు. నాకు సొంతంగా విమానం కావాలి.. మీకు వద్దా? పెద్దగా ఆలోచించరా? అన్నీ తప్పులే.. నువ్వేదో నాకు డబ్బులు కట్టేటట్టుగా మాట్లాడతావ్. ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు. ఏం చేయకూడదు.. సోషల్‌మీడియాలో ఏదీ పోస్ట్ చేయకూడదు. అసలేంటి ప్రాబ్లమ్? (Manchu Lakshmi Class to Trollers)
నేను డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతా. మా అమ్మానాన్నలెవరూ నాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. మీకష్టం మీరే పడాలి అనేది చిన్నప్పుడే నాన్నగారు నేర్పించారు. ఇది నా జీవితం.. నాకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటా. ఇంట్లో ఉండి వంట చెయ్యి, సామానులు తోమాలి.. నీ పిల్లలనే చూసుకో.. నీకు కెరియర్ ఉండకూడదు.. ఇవన్నీ తప్పు. నార్మలైజ్గా ఆలోచించండి.. అలా బతకండి. డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను వాళ్లతో నేను ఏకీభవించను. నా జీవితంలో ఎంతో డబ్బును చూశా. సిల్వర్, డైమండ్ కాదు.. నేను వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్ ఉన్న ఇంట్లో పుట్టి, పెరిగా. కానీ, అమెరికాలో ఉన్నప్పుడు రోజూ తినే తిండికోసం కూడా కష్టపడి పనిచేశాను. నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను.. మనీ మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది.. సంతోషాన్ని కాదు. ఒక్కసారి డీప్‌గా ఆలోచించండి. డబ్బు.. స్టేటస్ అని, ఫేమ్ అని, నేమ్ అనే వాటన్నింటినీ పక్కన పెడితే.. డబ్బు మనకి ఇచ్చేది ఫ్రీడమ్. వంట చేయడంలో తప్పులేదు. పిల్లల్ని పెంచడంలో తప్పులేదు. ఇల్లు చూసుకోవడంతో తప్పులేదు.. కానీ, నువ్వు అదే చేయాలి. మరొకటి చేయకూడదు అనడం మాత్రం నా దృష్టిలో తప్పు. ఒక చిన్న ట్వీట్ నన్ను ఇంత ఆలోచించేలా చేసింది. ప్రతీది తప్పుగా చూడటం మానేసి.. మనకున్న చిన్ని జీవితం (Small Life)లో ఎవరి కోసం వాళ్లు బతకండి. ఇంకెవరి కోసమో బతికే బతుకు ఒక బతుకా? వాళ్లు మీ కరెంట్ బిల్ కడుతున్నారా? ట్యూషన్ బిల్ కడుతున్నారా? మీ EMI లు ఏమైనా కడుతున్నారా? ఇతరుల అభిప్రాయాలను ఎత్తి చూపుతూ, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు.. నీ జీవితం నువ్ బతుకు’’ అంటూ మంచు లక్ష్మీ పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
============================
*Aakasam Dhaati Vasthaava: ‘ఉన్నానో లేనో..’ ఆకట్టుకుంటోన్న మ్యాజికల్ మెలోడీ..
**********************************************
*Rashmika Mandanna: ‘యానిమల్’ నుంచి నేషనల్ క్రష్ లుక్కొచ్చింది
**************************************
*Vishal: న్యాయస్థానం కంటే గొప్ప వ్యక్తిగా భావించొద్దు.. విశాల్‌కు హైకోర్టు చురకలు
**************************************
*Devil: ‘డెవిల్’లోని ‘మాయే చేసి’ పాట కోసం ఎలాంటి వాయిద్యాలు వాడారో చూశారా?
**************************************