Niharika: పచ్చి మామిడికాయ తింటూ నిహారిక పోస్ట్.. అంతా షాక్!

ABN , First Publish Date - 2023-04-05T15:14:56+05:30 IST

ఒక వైపు విడాకులు అంటూ వార్తలు వినిపిస్తుంటే.. నిహారిక మాత్రం పచ్చి మామిడి కాయ ముక్కలు తింటూ ఆనందంగా కనిపించింది. దీంతో అంతా..

Niharika: పచ్చి మామిడికాయ తింటూ నిహారిక పోస్ట్.. అంతా షాక్!
Mega Daughter Niharika

ఈ మధ్య మెగా డాటర్ నిహారిక (Mega Daughter Niharika) ఏ రేంజ్‌లో వార్తలలో వైరల్ అవుతుందో తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె వార్తలలో నిలిచింది. ఇటీవల నిహారిక (Niharika), ఆమె భర్త చైతన్య (Chaitanya Jonnalagadda) విషయంలో ఎటువంటి వార్తలు వినిపించాయో తెలియంది కాదు. వారి వ్యవహారం విడాకుల వరకు వెళ్లిందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీ (Mega Family) సైడ్ నుంచిగానీ, అలాగే చైతన్య ఫ్యామిలీ సైడ్ నుంచి గానీ ఎవరూ రియాక్ట్ కాలేదు. దీంతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కలగజేసుకుని, ఇరు ఫ్యామిలీలకు సర్ది చెప్పారని, వారి మధ్య ఏర్పడిన మనస్పర్థలను దూరం చేశారనేలా కూడా టాక్ నడిచింది. అయితే ఇలాంటి వార్తలన్నీ రావడానికి కారణం.. నిహారిక, చైతన్య.. తమ ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు, ఇరువురు కలిసి ఉన్న ఫొటోలు తొలగించడమే. ఇద్దరూ చేసిన ఈ పని.. ఒక్కసారిగా హాట్ హాట్ చర్చలకు తావిచ్చింది. అనంతరం వాతావరణం కాస్త చల్లబడింది. ఇప్పుడు మళ్లీ నిహారిక తన ఇన్‌స్టా పోస్ట్‌తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కదలికకి కారణమైంది.

Niharika-2.jpg

ప్రస్తుతం నిహారిక పేరు సోషల్ మీడియా (Social Media) సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. అందుకు కారణం.. తను ఇన్‌స్టాలో పచ్చి మామిడి కాయ (Mango) తింటూ పెట్టిన పోస్టే. ఈ పోస్ట్ చూసిన వారంతా.. నిహారిక ప్రెగ్నెంటా? (Niharika Pregnant) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పెట్టిన ఈ పోస్ట్ కింద నెటిజన్లు అంతా ఇదే ప్రశ్న ఆమెని అడుగుతున్నారు. మాములుగా ఇది వేసవి కాలం (Summer). మామిడి పళ్ల సీజన్ (Mangoes Season). ఇది సీజన్ కాబట్టి మామిడి పండు తినడంతో పెద్దగా వింతేమీ లేదు. కానీ ఆమె పచ్చి మామిడి కాయ ముక్కలు తినడంతో.. అందరూ షాకయ్యారు. ఎందుకంటే.. ఒకవైపు విడాకులు (Divorce) అనేలా వార్తలు రావడం.. ఇప్పుడేమో ఆమె పచ్చి మామిడి కాయ ముక్కలు తింటూ కనిపించడంతో.. నెటిజన్లకు లేనిపోని అనుమానాలు (Doubts) వచ్చేశాయి. మాములుగా అయితే గర్భం దాల్చిన మహిళలకు పుల్లటి మామిడి కాయ తినాలని ఉంటుందని అంటుంటారు. అలానే ఇప్పుడందరూ నిహారికను అపార్థం చేసుకుంటున్నారు.

Also Read-Ashok Galla2: యాక్షన్‌లోకి దిగిన అశోక్ గల్లా.. మహేష్ బాబు ఏమన్నారంటే?

అపార్థం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. నిహారిక ఈ వీడియోకు చక్కగా క్లారిటీ కూడా ఇచ్చింది. మ్యాంగోస్ లేకుండా సమ్మర్ ఏం బాగుంటుంది? అంటూ ఆమె తన పోస్ట్‌కు రాసుకొచ్చింది. అంటే సీజన్ ప్రకారమే ఆమె మ్యాంగోస్ తింటుంది తప్పిదే.. నెటిజన్లు అనుకుంటున్న విశేషం అయితే కానే కాదు. మ్యాంగోస్‌పై తనకున్న ఇష్టాన్ని నిహారిక ఇలా వ్యక్తపరిచింది తప్పిదే.. వేరే ఏం లేదక్కడ. ఈ విషయం తెలియక నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ఆమెనే క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ చూసి నిహారిక సరదాగా నవ్వుకుని ఉంటుంది కూడా. ప్రస్తుతానికైతే పచ్చి మామిడి కాయ ముక్కలు తింటున్న నిహారిక పోస్ట్ (Niharika Insta Post) వైరల్ అవుతుండటమే కాకుండా.. అనేక కొత్త చర్చలకు మాత్రం తావిస్తోందన్నది మాత్రం నిజం.


ఇవి కూడా చదవండి:

*********************************

*Where is Pushpa?: ‘పుష్పరాజ్’ ఎక్కడ?.. సమాధానం తెలిసేది ఎప్పుడంటే?

*Jr NTR: అఫీషియల్.. మరో యుద్ధానికి సిద్ధం

*Rashmika Mandanna: నేషనల్ క్రష్‌ ఎలా అయిందో తెలుసా?

*Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్

Updated Date - 2023-04-05T15:14:57+05:30 IST