Nandamuri Balakrishna: మొన్న ఎవడో వెధవ అన్నాడు, ఆ వెధవ అతనేనా? ఈ మాటలు ఇప్పుడు వైరల్...

ABN , First Publish Date - 2023-10-16T12:48:14+05:30 IST

'భగవంత్ కేసరి' మీడియా సమావేశంలో ఎవడో ఒక వెధవ తన విగ్ గురించి కామెంట్ చేసాడు అని, వాడికి గట్టిగా ఇచ్చాను అని బాలకృష్ణ చెపుతూ తనది అంతా ఓపెన్ బుక్ అని చెప్పారు. ఇంతకీ బాలకృష్ణ వెధవ అన్నది అతన్నెనా, సాంఘీక మాధ్యమంలో ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Nandamuri Balakrishna: మొన్న ఎవడో వెధవ అన్నాడు, ఆ వెధవ అతనేనా? ఈ మాటలు ఇప్పుడు వైరల్...
Nandamuri Balakrishna speaking about his film Bhagavanth Kesari

నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) ఎప్ప్పుడు ఏమి మాట్లాడినా సంచలనమే అవుతుంది. తన రాబోయే సినిమా 'భగవంత్ కేసరి' #BhagavanthKesari గురించి చాలా గొప్పగా చెపుతున్నారు బాలకృష్ణ, అందుకనే దానికి విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి (AnilRavipudi) దీనికి దర్శకుడు, కాజల్ అగర్వాల్ (KajalAggarwal) కథానాయిక, శ్రీలీల (Sreeleela) ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మీడియా సమావేశం నిన్న ఆదివారం ఒక హోటల్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో బాలకృష్ణ అందరి గురించి మాట్లాడుతూ కెమరామెన్ రాంప్రసాదు (Ramprasad) గురించి కూడా గొప్పగా చెప్పారు.

రాంప్రసాదు తనకి ఎప్పటి నుంచో పరిచయం అని, తనని ఎలా చూపిస్తే బాగుంటుందో అతనికి బాగా తెలుసు అని, అప్పట్లో కేరవానులు ఉండేవి కావని, అందరమూ చెట్టు కింద, చాప, దిండు వేసుకొని పడుకునే వాళ్ళం అని చెపుతూ, అప్పుడు అందరి ముందే విగ్ తీసేసే వాడిని అని చెప్పారు, అంటే విగ్ పెట్టుకోవటంలో రహస్యం ఏమీ లేదు అన్నట్టుగా చెప్పారు బాలకృష్ణ.

bhagavanthkesari1.jpg

అదే సమయంలో బాలకృష్ణ తన విగ్ గురించి మాట్లాడుతూ, మొన్న ఎవడో వెధవ నా విగ్గు గురించి మాట్లాడుతూ, వీడు విగ్గు పెట్టుకుంటాడా అని అన్నాడు అని చెపుతూ, అవును నేను విగ్గు పెట్టుకుంటాను, నీకేంటి నువ్వు ఏమి పీక్కొని గెడ్డం పెట్టుకున్నావు అని అడిగాను, అని చెప్పారు. ఓపెన్ బుక్ మనమంతా అని చెప్పారు బాలకృష్ణ. ఎవడికీ భయపడే పనే లేదు. వాడు మళ్ళీ వాగేడు అంటే... అని ఒక వార్నింగ్ లా అంటూ ఆగిపోయారు బాలకృష్ణ.

ఇంతకీ బాలకృష్ణ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు అని అందరూ అనుకుంటూ ఉంటే, సాంఘీక మాధ్యమాల్లో మాత్రం ఈ మాటలు ఆంధ్ర ఎంఎల్ఏ కొడాలి నాని (KodaliNani) ని ఉద్దేశించి అన్న మాటలు అని అంటున్నారు. కొడాలి నాని ఈమధ్య అందరి మీద బాగా నోరు పారేసుకుంటున్నాడు, ఎవరిని పడితే వాళ్లని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికి ఎదోస్తే అదే మాట్లాడుతున్న నాని ని ఉద్దేశించి బాలకృష్ణ ఈ మాటలు అన్నారు అని సాంఘీక మాద్యమంలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-10-16T12:48:14+05:30 IST