Hi Nanna Party: పోటీలోకి ‘హాయ్ నాన్న’ పార్టీ.. మేనిఫెస్టో విడుదల
ABN , First Publish Date - 2023-11-18T21:23:24+05:30 IST
నేచురల్ స్టార్ నాని యూనిక్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకులని అలరించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్ర గ్లింప్స్, టీజర్, ఇప్పటి వరకు విడుదలైన పాటలు నేషనల్ వైడ్‌గా మంచి స్పందనను రాబట్టుకున్నాయి. డిసెంబర్ 7న ఈ సినిమా విడుదల కాబోతోన్న నేపధ్యాన్ని పురస్కరించుకుని.. పొలిటికల్ మార్గంలో ప్రమోషన్స్‌ని మొదలెట్టారు.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) యూనిక్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్ నాన్న’ (Hi Nanna)తో ప్రేక్షకులని అలరించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్ర గ్లింప్స్, టీజర్, ఇప్పటి వరకు విడుదలైన పాటలు నేషనల్ వైడ్‌గా మంచి స్పందనను రాబట్టుకున్నాయి. డిసెంబర్ 7న ఈ సినిమా విడుదల కాబోతోన్న నేపధ్యాన్ని పురస్కరించుకుని.. వినూత్నంగా నాని ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో.. రాజకీయ నాయకుడి గెటప్‌లో రెడీ అయ్యి.. ‘హాయ్ నాన్న’ పేరుతో ఓ పార్టీ (Hi Nanna Party) పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు. పార్టీ అన్నాక మేనిఫెస్టో ఉంటుంది కదా.. దానిని రెడీ చేసి శనివారం విడుదల చేశారు. పార్టీ మేనిఫెస్టో అంటూ తాజాగా నాని తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు. అందులో.. (Hi Nanna Party Manifesto)
‘‘ఏంటయ్యా అందరూ వచ్చారా అంటూ మీడియా మైకులు చూసుకున్న అనంతరం.. ఇక మొదలెడదాం.
మన పార్టీ ‘హాయ్ నాన్న’ పార్టీ మేనిఫెస్టో అంశాలివే..
మనపార్టీ ‘హాయ్ నాన్న’ పార్టీ కనుక అధికారంలోకి వస్తే.. యూత్ అందరికీ విచ్చలవిడిగా రీల్స్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్లు, లైటింగ్ సెటప్‌లు కిట్లుకిట్లుగా ఇవ్వడం జరుగుతుంది.
అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం. థియేటర్ల ఆదాయం, అలాగే ఆ పక్కన ఉన్న కిరాణా కొట్టు వాళ్ల ఆదాయం కూడా. సబ్జెక్ట్, టాపిక్ తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా వాగే వారి ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం.
నన్ను కనుక పదవిలో కూర్చోబెడితే.. ప్రతి జంక్షన్లో నా బొమ్మ ఉండేలా చూస్తా. అలాగే ప్రతి థియేటర్లో మా బొమ్మ ఉండేలా చూస్తా. అదే మా ‘హాయ్ నాన్న’.
వరల్డ్ కప్ ఫైనల్‌కి టిక్కెట్స్ డిస్కౌంట్లో ఇప్పిస్తాం (వరల్డ్ కప్ అయిపోయిందిగా అని మీడియా పర్సన్ అంటే.. ఈ వరల్డ్ కప్ కాదు.. రాబోయే వరల్డ్ కప్. పక్కకు తిరిగి.. చెబుతాం కానీ ఇవ్వనవసరం లేదు కదా.. హా ఓకే ఓకే)
మీ ఫేవరెట్ పార్టీ అయిన హాయ్ నాన్నని గెలుపించుకోవడానికి.. హాయ్ నాన్న అంటే తండ్రికూతుళ్ల రిలేషన్ గుర్తొస్తుంది.. అందుకే ప్రతి తండ్రికి, ప్రతి కుమార్తెకు 2 ఓట్లు ఉంటాయి. వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట. మాములుగా అయితే ఓట్లు 18 ప్లస్ వేయాలి. కానీ హాయ్ నాన్నకు అలా కాదు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు.. ఏజ్‌తో సంబంధం లేకుండా అందరూ వేయవచ్చు. (Hi Nanna Movie Promotions)
ప్రతి సినిమా శుక్రవారం విడుదల చేస్తారు.. మీరెందుకు సార్ ఒక రోజు ముందే వస్తున్నారు అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అదే చెబుతున్నా.. ఏ పార్టీ అయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలు అనేది తరతరాలుగా మన చరిత్రలో ఉంది. మాకు కూడా అంత కాన్ఫిడెంట్ ఉండటంతో టీమ్ (పార్టీ నేతలు)తో డిస్కస్ చేసి ఒక రోజు ముందే వస్తున్నాం.
NRI లు కూడా మా పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ల కోసం కూడా వాళ్లు ఉండే ఏరియాలలో RTC X Roads నిర్మించాలని ఫిక్స్ అయ్యాం. అక్కడే సంధ్య, దేవి, సుదర్శన్ వంటి థియేటర్లు అన్నీ కట్టిస్తాం.
డిసెంబర్ 7న మార్నింగ్ షోకి బస్తా పేపర్లు సప్లయ్ చేయం.. మీరే తెచ్చుకోవాలి. కానీ అవి విసరడానికి కావలసిన రీజన్స్, కంటెంట్ మేమిస్తాం.
ఫైనల్‌గా మ్యాటర్‌లోకి వస్తూ..
మా పార్టీకే ఓటేయండి అని రాజకీయ నాయకులు ఇలాంటి కబుర్లు ఎన్నో చెబుతారు. మా సినిమానే చూడండి అని యాక్టర్స్ కూడా ఇలా ఎన్నో చెబుతారు. కానీ మీ మనసుకు తెలుసు.. ఆలోచిస్తే అర్థమైపోతుంది. మంచి వాడికే ఓటేయండి. మంచి సినిమానే థియేటర్లో చూడండి. ఓట్ వేయడం, వాచ్ చేయడం బాధ్యత అని తెలుసుకోండి. హాయ్ నాన్న డిసెంబర్ 7న వస్తుంది.
ఈ మధ్య మీరందరినీ తిడుతున్నారు.. అందులో మీడియా వారిని పక్కన పెట్టాలి. మీరు సారీ చెప్పాల్సిందే అని ఓ విలేఖరి అడుగగా.. సారీ చెప్పడానికి నేను ఏమైనా యాంకర్ని అనుకున్నావా.. రాజకీయ నాయకుడిని.. సస్తే చెప్పను.. అంటూ కండువా పైకి ఎగరేసుకుంటూ నాని జారుకున్నారు.
ఇవి కూడా చదవండి:
========================
*Rajinikanth: ‘ముత్తు’ రీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. థిల్లాన థిల్లాన దుమ్మురేపుతుందా..
*******************************
*Siren Teaser: మంచోడు.. మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా?
********************************
*Unstoppable with NBK: ‘వైల్డెస్ట్ ఎపిసోడ్ ప్రోమో’.. బాలయ్యను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ హీరో..!
********************************