Natti Kumar: అది కరెక్ట్ కాదు... ఏపీ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
ABN , First Publish Date - 2023-06-01T14:32:34+05:30 IST
ఏపీ ఫైబర్ నెట్‌లో కొత్త సినిమాలు పదర్శించబోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని అన్నారు నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ కాదని నట్టి కుమార్ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఏపీ ఫైబర్ నెట్ (AP Fiber Net)లో కొత్త సినిమాలు పదర్శించబోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని అన్నారు నిర్మాత, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ (Natti Kumar). థియేటర్స్‌లో కొత్త సినిమా విడుదలైన మొదటి రోజునే ఏపీ ప్రభుత్వం (AP Government) ఆధ్వర్యంలోని ఫైబర్ నెట్‌లో ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రారంభోత్సవం శుక్రవారం విశాఖపట్నం (Vizag)లో జరగనుంది. ఈ నేపథ్యంలో దీనిపై నట్టి కుమార్ మీడియా సమావేశం నిర్వహించి ఏపీ సీఎం నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎక్కడా లేనివిధంగా సినిమా విడుదల రోజున ఏపీ ఫైబర్ నెట్‌లో (Andhra Pradesh State FiberNet Limited) కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పించబోతున్నామని ప్రభుత్వం అంటోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక నిర్మాతగా, ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్‌గా, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను వ్యతిరేకిస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమను, అలాగే నిర్మాతల మండలిని, ఫిలిం ఛాంబర్‌ను సంప్రదించకుండా, జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు. గతంలో అంటే 2013వ సంవత్సరంలోనే ఎయిర్ టెల్ డీటీహెచ్ ద్వారా సినిమా విడుదల రోజునే సినిమాలను ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ అది సక్సెస్ కాలేదు. తమ సినిమాలు ఇచ్చే నిర్మాతలు ముందుకు రానప్పుడు ఇది ఎలా సక్సెస్ అవుతుంది. వాస్తవానికి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థను సర్వనాశనం చేసేవిధంగా ఈ విధానం ఉంటుంది. అందుకే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే కాకుండా అత్యధిక భాగం నిర్మాతలు దీనికి వ్యతిరేకం. అయినప్పటికీ, ఏపీ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) సినీరంగానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా.. సినీ పరిశ్రమ వారితో మీటింగ్ ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకోకుండా దీనిని ఆచరణలోకి తీసుకుని రావడం ఎంతమాత్రం సహేతుకం కాదు. (Natti Kumar on AP Fiber Net Decision)
ఇప్పటికే ఎగ్జిబిషన్ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఫైబర్ నెట్‌లో సినిమాల నిర్ణయం వల్ల ఎగ్జిబిషన్ వ్యవస్థ మరింతగా కోలుకోలేని విధంగా తయారవుతుంది. శుక్రవారం వైజాగ్‌లో ప్రారంభం కాబోయే ఫైబర్ నెట్ సినిమాల ఆవిష్కరణ సభకు సంబంధించి నిర్మాతలను కానీ, సినీ పరిశ్రమకు చెందిన ఇతరులకు తెలియకుండా, పిలుపు లేకుండానే జరపబోతున్నారు. ఏపీ మంత్రులు గోపాలకృష్ణ, గుడివాడ అమర్నాథ్, ఎఫ్.డి.సి చైర్మన్ పోసాని, ఇంకా సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొనబోతున్నట్లు తెలిసింది. పరిశ్రమ వారిని కలుపుకుని పోకుండా, వారికి ఆహ్వానం లేకుండా వారికి వారే ఈ ప్రారంభాన్ని జరపబోవడం విడ్డూరంగా ఉంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) దీనిపై పునరాలోచించి ఎవరికీ ఇబ్బందిలేని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Jurassic June: ‘జురాసిక్ పార్క్’కు 30 ఏళ్లు.. ఆ పేరు ఇక ఉండదు
*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..
*Agent: ఓటీటీలో.. అందుకే విడుదల కాలేదా?
*Srikanth Addala: ‘అఖండ’ బ్యానర్‌లో శ్రీకాంత్ అడ్డాల సినిమా.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
*RRR: చరణ్, ఎన్టీఆర్ కాదు.. అసలు సిసలైన ‘RRR’ కాంబినేషన్ ఇదే.. వీడియో వైరల్