Renu Desai: పవన్ కళ్యాణ్ గురించి అతని మాజీ భార్య సంచలన వీడియో, పిల్లలను ఇందులోకి లాగొద్దు ప్లీజ్...

ABN , First Publish Date - 2023-08-10T19:26:30+05:30 IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గురించి, ప్రస్తుత రాజకీయాల గురించి అందులో సంచలన వ్యాఖ్యలు చేశారు

Renu Desai: పవన్ కళ్యాణ్ గురించి అతని మాజీ భార్య సంచలన వీడియో, పిల్లలను ఇందులోకి లాగొద్దు ప్లీజ్...
Renu Desai

ఈమధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ (PawanKalyan) సినిమా 'బ్రో: ది అవతార్' #BroTheAvatar మంచి పాజిటివ్ టాక్ తో ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి తమిళ దర్శకుడు సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం చెయ్యగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) మాటలు రాశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) కూడా నటించాడు. ఈ సినిమా సముద్రఖని తీసిన తమిళ సినిమా 'వినోదయ సిత్తం' #VinodayaSitham సినిమా ఆధారంగా నిర్మించింది. ఇందులో 30 ఇయర్స్ పృథ్వి (30YearsPrudhvi) చేసిన శ్యాంబాబు (Shyambabu) పాత్ర కొంచెం వివాదం అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ శ్యాంబాబు పాత్ర నన్ను ఉద్దేశించి పెట్టారు అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు (AmbatiRambabu) మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అప్పుడే అతను పవన్ కళ్యాణ్, అతని పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలు అందరితో ఒక సినిమా, లేదా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నామని రకరకాల పేర్లు కూడా ప్రకటించాడు. అతను మీడియా సమావేశంలో చెప్పిన వార్తలు తరువాత సాంఘీక మాధ్యమాల్లో కూడా వచ్చాయి. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (RenuDesai) స్పందించి ఒక సుదీర్ఘ వీడియో పోస్ట్ చేసి అందులో తాను ఏమి చెప్పదలుచుకుందో అంత అందులో చెప్పారు. RenuDesaiVideoGoesViral

renudesai1.jpg

పవన్ కళ్యాణ్ మంచి మనిషి, సమాజానికి ఏదైనా మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు, అతనికి నేను మొదటి నుండి సపోర్ట్ చేస్తున్నాను, ఇంకా చేస్తాను కూడా అని చెప్పారు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, సొసైటీ కి ఏదైనా చెయ్యాలన్న తపన పడే మనిషి అని రేణు దేశాయ్ చెప్పారు. RenuDesaiVideo అతను సినిమా కెరీర్ చాలా బాగుంది, అందులో కంటిన్యూ అయితే అతనికి బాగా డబ్బులు కూడా వస్తాయి, కానీ అవన్నీ వదులుకొని, కుటుంబాన్ని, పిల్లలని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకంటే ప్రజలకి ఏదైనా చెయ్యడానికి, అది నిజం అని చెప్పారామె.

అయితే ఈ రాజకీయాల్లో భాగంగా మీరు మీరు ఎన్నైనా విమర్శిచుకోండి కానీ మీకు అతని మాజీ భార్యలని, పిల్లలను ఇందులోకి మాత్రం లాగకండి అని రేణు దేశం విజ్ఞప్తి చేశారు. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుసు, నేను విడిపోయి 11 సంవత్సరాలు అవుతున్న, సొసైటీ లో వున్న ఒక మనిషిగా చెపుతున్నాను, పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు. మీకు ఏమైనా రాజకీయంగా ఉంటే అతనితో చెయ్యండి, అంతే కానీ అతని పిల్లల్ని మాత్రం ఇందులోకి లాగకండి.

నేను ఒక అమ్మగా మీ అందరికీ వేడుకుంటున్నాను. నా పిల్లల తండ్రి ఒక నటుడు, రాజకీయనాయకుడు, అందుకని వాళ్ళు కూడా సినీ నేపధ్యం నుండి వచ్చినవాళ్లే. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, నా పిల్లలే కాదు, అతని ఇంకో భార్య పిల్లలు కూడా చిన్నవాళ్ళే. వాళ్ళని ఎందుకు ఇందులోకి లాగుతారు, వాళ్ళకి ఏమి సంబంధం. మీరు ఎదో సినిమా, వెబ్ సిరీస్ తీస్తామంటున్నారు, అందులో భార్యల, పిల్లల గురించి కూడా ఉంటుంది అంటున్నారు, దయచేసి వాళ్ళని ఇందులోకి లాగకండి. నా పిల్లలే కాదు ఏ పిల్లలని, ఏ ఆడవాళ్ళని కూడా ఇందులోకి లాగొద్దు. రాజకీయంగా మీరూ మీరూ చూసుకోండి, అని ఒక సుదీర్ఘ వీడియో పెట్టారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది సాంఘీక మాధ్యమాల్లో.

Updated Date - 2023-08-10T19:26:30+05:30 IST