Breaking News: గుంటూరు కారం నుండి తప్పుకున్న పూజ హెగ్డే, కారణం ఇదే !
ABN , First Publish Date - 2023-06-20T10:46:46+05:30 IST
'గుంటూరు కారం' సినిమా ఉంటుందా, ఉండదా అనే సందేహాలు ఇప్పుడు మహేష్ అభిమానుల్లో మరికొంచెం ఎక్కువయింది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో కథానాయకురాలిగా నటిస్తున్న పూజ హెగ్డే ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు వార్త. అలాగే సంగీత దర్శకుడు థమన్ కూడా తప్పుకుంటున్నాడు అని సాంఘీక మాధ్యమాల్లో వార్త వైరల్ అయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaram కి కష్టాలు ఇంకా సమసిపోలేదు. ఈ సినిమా షూటింగ్ అంటూ ఇందులో నటిస్తున్న ఆర్టిస్టుల డేట్స్ తీసుకుంటున్నారు, కానీ షూటింగ్ పోస్టుపోన్ అంటూ చివరి నిముషం లో చెపుతున్నారు. ఇలా ఇంతవరకు చాలా సార్లు షూటింగ్ పోస్టుపోన్ చెయ్యడంతో ఈ సినిమాలో ఎవరెవరు ఆర్టిస్టులు వున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా నుండి తప్పుకుంటే బాగుంటుంది అనే ఆలోచనల్లో వున్నారని తెలిసింది.
ఇందులో పూజ హెగ్డే (PoohaHegde), శ్రీలీల (Sreeleela) కథానాయకురాలుగా వేస్తున్నారు. ఇప్పటికే పూజ హెగ్డే ఈ సినిమా కోసం సుమారు 60 రోజులు కేటాయించిందని, కానీ ఒకరోజు కూడా షూటింగ్ జరగలేదని, అందువల్ల ఇప్పుడు తప్పుకోవటమే మంచిది అన్న అభిప్రాయానికి వచ్చింది అని తెలిసింది. ఈ సినిమా కోసమని వేరే సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని కూడా తెలిసింది. అందువలన, ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ చేస్తారో ఆ చిత్ర నిర్వాహకులకు కూడా తెలియడం లేదని అందువలన పూజ హెగ్డే తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది.
అయితే ఆమె ఇంకా అధికారికంగా ఏ విషయం చెప్పలేదు, ఎందుకంటే ఈరోజు ఆమె తన మేనేజర్ తో మాట్లాడి ఈ విషయం మీద నిర్ణయం తీసుకుంటుంది అని తెలిసింది. అలాగే సంగీత దర్శకుడు థమన్ (SSThaman) కూడా తప్పుకున్నాడు అని సాంఘీక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియయటం లేదు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ఈ సినిమా నిర్మాత నాగ వంశి (NagaVamsi) ట్విట్టర్ లో ఏది మెసేజ్ పెడుతున్నాడు కానీ, షూటింగ్ అవటం లేదు అన్నది నిజమే అని అందరూ అంటున్నారు.
ఈ సినిమాకి డేట్స్ అడిగిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎన్నో సినిమాలు వదులుకుని ఈ సినిమాకి డేట్స్ కేటాయించినట్టుగా తెలిసింది. సుమారు 60 నుండి 70 రోజుల పాటు ఒక్కొక్కరు డేట్స్ ఈ సినిమాకి కేటాయిస్తే, ఒక్కరోజు కూడా షూటింగ్ అవలేదు అని తెలిసింది. కనీసం ఇలా డేట్స్ ఇచ్చినందుకు అందరికీ ఒక్క పైసా కూడా పారితోషికం ఇవ్వలేదని కూడా తెలిసింది. వేరే సినిమాలు పోయాయి, ఈ సినిమా షూటింగ్ అవలేదు, ఆర్టిస్టులు చాలా రోజులు పని లేక ఈ సినిమా వలన ఇంట్లో కాళీగా కూర్చోవలసి వచ్చిందని వాపోతున్నారని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.