Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు
ABN , First Publish Date - 2023-02-21T22:55:06+05:30 IST
సినిమా సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా.. అందుకు దర్శకుడే కారణమని అన్నారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా
సినిమా సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా.. అందుకు దర్శకుడే కారణమని అన్నారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’(వాతి) (Sir). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush), సంయుక్త మీనన్ (Samyuktha Menon) జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించారు. సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో హ్యాండ్సమ్ హీరో సుమంత్ (Sumanth) అతిథి పాత్రలో నటించారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న భారీస్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతూ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో తాజాగా చిత్ర బృందం విజయోత్సవ సభ (Sir Success Meet)ను నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మూర్తిగారు.. చివరిగా.. సినిమా సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా.. అందుకు కారణం దర్శకుడే అనేలా వివరణ ఇచ్చారు.
ఇవే మాటలు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఆయన అటెండ్ అయిన ప్రతి వేడుకలో చెబుతుంటారు. ‘ఆచార్య’ (Acharya) విషయంలో కూడా ఆయన ఇదే మాట అంటే.. అందరూ ఆయనని ట్రోల్ చేశారు. కానీ ‘సార్’ (Sir) ఈవెంట్లో ఆర్. నారాయణమూర్తి క్లారిటీగా అంతా దర్శకుడిదే అని చెప్పుకొచ్చారు. దర్శకులపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మూర్తిగారు ఏం చెప్పారంటే..
‘‘ఏయ్.. తమ్ముళ్లూ.. సినిమా సక్సెస్‌కు, ఫెయిల్యూర్‌కు కారణం డైరెక్టరే. కథ, కథనం, దర్శకత్వం ఈ మూడు బాగుంటే.. వీటిలోని పల్స్ ఎవరికి తెలుస్తుందో.. అతనే సక్సెస్ఫుల్ డైరెక్టర్. అతని చేతిలోనే అంతా ఉంది. భారీ తారాగణం కానీ, ఇతర ఏవైనా గానీ.. వారి స్టామినాని బట్టి, స్టార్‌ని బట్టి సినిమాలు ఆడతాయ్.. ఓకే. కానీ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మాత్రం దర్శకుడి టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. మిగతా వాళ్లంతా ఎవరి పని వాళ్లు చేస్తే సరిపోతుంది.ఫ్లాప్, హిట్ సినిమాలకి ఒకేలా కష్టపడతాం. కొన్ని హిట్టవుతాయి.. ఎందుకంటే, ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకుని.. వాటిపై పట్టున్న వాడే సక్సెస్ఫుల్ దర్శకుడు. సినిమాకి తల్లి నిర్మాత అయితే.. తండ్రి దర్శకుడు. ఇంటికి పెద్దన్న వంటివాడు హీరో. మిగతా వారంతా కూడా కుటుంబ సభ్యులే..’’ అని ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. (R Narayana Murthy Speech)