Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియోపై ఆందోళన, రష్మికకి మద్దతు

ABN , First Publish Date - 2023-11-07T11:32:48+05:30 IST

రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సాంఘీక మాధ్యమంలో ఒక కుదుపు కుదిపింది. సాంకేతికని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని, దీనిమీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, రష్మికకి కల్వకుంట్ల కవితతో పాటు చాలామంది తమ మద్దతు తెలిపారు.

Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియోపై ఆందోళన, రష్మికకి మద్దతు
Rashmika Mandanna and Kalvakuntla Kavitha

సాంకేతిక పెరుగుతున్న కొద్దీ దాన్ని మంచి పనులకు కాకుండా కొంతమంది అది దుర్వినియోగం చెయ్యడానికి పూనుకున్నారు. అయితే అది కూడా మనుషుల మీద, ఆడవాళ్ళ మీద చెయ్యడం దారుణం అని, సహేతుకం కాదు అని సాంఘీక మాధ్యమంలో చాలామంది రష్మికకి (RashmikMandanna) సపోర్ట్ గా పోస్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో #DeepFakeVideo సాంఘీక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ వీడియో మీద స్పందించి ఇలా చేసేవాళ్ల మీద చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

rashmika-mandanna1.jpg

అమితాబ్ బచ్చన్ (AmitabhBachchan) స్పందించిన తరువాత నిన్న సాంఘీక మాదేమంలో రష్మికకి ఎంతోమంది తమ మద్దతు తెలిపారు. నీకు సపోర్ట్ గా మేమున్నాం అంటూ చాలామంది ఆ ఫేక్ వీడియో, ఒరిజినల్ వీడియో రెండూ పోస్ట్ చేసి ఇలాంటివి ముందు ముందు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (KalavakuntlaKavitha) ఈ డీప్ ఫేక్ వీడియో పై ఆందోళన వ్యక్తం చేస్తూ, సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి అని విజ్ఞప్తి చేశారు. ఇటువంటివి జరగకుండా తగిన చర్యల రూపకల్పన కోసం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి అని కూడా ఆమె చెప్పారు. సైబర్ ముప్పు నుంచి మహిళలను కాపాడాల్సిన తక్షణ అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

Kavitha-Kalvakuntla.jpg

సైబర్ ముప్పు నుంచి మహిళలను రక్షించాల్సిన తక్షణ అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. రక్షణ చర్యలను సమగ్రంగా రూపొందించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని (NarendraModi), కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (AshwiniVaishnav) ను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమ నుండి అగ్ర నటులు ఎవరూ ఈ డీప్ ఫేక్ వీడియో పై స్పందించకపోవటం ఆశ్చర్యకరం.

Updated Date - 2023-11-07T11:32:49+05:30 IST