RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-04-28T13:23:00+05:30 IST
విషయం తెలుసుకున్న బంజారా హిల్స్ పోలీసులు మణికంఠన్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విషయంలోకి వస్తే..
దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ (Mega Power Star), యంగ్ టైగర్ (Young Tiger) కలిసి నటించిన ‘RRR’ సినిమాలో ఎత్తర జెండా పాటలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన మణికంఠన్ (Manikantan)ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాగిన మత్తులో వాచ్‌మెన్‌తో గొడవకు దిగిన మణికంఠన్.. అతనిని మూడవ అంతస్తు నుంచి తోసేయడంతో.. ప్రస్తుతం వాచ్మెన్ తీవ్రగాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బంజారా హిల్స్ పోలీసులు మణికంఠన్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
విషయంలోకి వస్తే.. బంజారా హిల్స్ రాఘవ రెసిడెన్సీలో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మణికంఠన్ మద్యం సేవించి గొడవ చేస్తుండగా.. కారిడార్‌లో గొడవ చేయవద్దంటూ వాచ్మెన్ అతనికి సూచించాడు. దీనికి కోపోద్రిక్తుడైన మణికంఠన్.. వాచ్మెన్ యాదగిరిని మూడవ అంతస్తు నుంచి తోసేశాడు. దీంతో అతనికి తీవ్రస్థాయిలో గాయాలవడంతో వెంటనే అపార్ట్మెంట్లోని వారు అతనిని హాస్పిటల్‌కి తరలించారు. ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో.. వెంటనే వారు రంగంలోకి దిగి.. డ్యాన్సర్ మణికంఠన్ (Side Dance Manikantan)ని అదుపులోకి తీసుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ఎండ్ టైటిల్స్‌లో వచ్చే ‘ఎత్తర జెండా’ పాటలో సైడ్ డ్యాన్సర్‌గా మణికంఠన్ నటించాడు. తమిళ సినీ పరిశ్రమ (Kollywood)కు చెందిన మణికంఠన్.. ప్రస్తుతం టాలీవుడ్లో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా విషయానికి వస్తే.. ఇందులో కీరవాణి స్వరపరిచిన, చంద్రబోస్ సాహిత్యం వహించిన ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు ఈ చిత్రం ఇప్పటి వరకు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. స్టార్ హీరోలు రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR)లు ఇందులో కనబరిచిన నటనకు హాలీవుడ్ ప్రముఖులు నీరాజనాలు పడుతున్నారు. ఈ ఇద్దరితో సినిమాలు చేయాలని ఉందంటూ హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకులు ముందుకు వస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి:
************************************************
*PS2: ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రత్యేక షోలు రద్దు.. సినిమాపై చిత్రయూనిట్ స్పందనిదే..
*‘PS2’ Twitter Review: ‘బాహుబలి’ సరిపోదు.. ఇండియన్ సినిమా గర్వపడే చిత్రమిది
*Agent Twitter Review: అయ్యగారి సినిమా టాక్.. ఏదో తేడాగా ఉందే..?
*Surender Reddy Universe: ‘ఏజెంట్’లో ‘ధృవ’.. వీడియో అదిరింది