Salman Khan: స్టార్ హీరో అయినా రిజెక్షన్ తప్పదా?.. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటే..

ABN , First Publish Date - 2023-03-16T13:04:43+05:30 IST

బాలీవుడ్‌లో టాప్ హీరోల గురించి మాట్లాడితే.. అందులో సల్మాన్ ఖాన్ (Salman Khan) పేరు కచ్చితంగా ఉంటుంది.

Salman Khan: స్టార్ హీరో అయినా రిజెక్షన్ తప్పదా?.. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటే..
Salman Khan

బాలీవుడ్‌లో టాప్ హీరోల గురించి మాట్లాడితే.. అందులో సల్మాన్ ఖాన్ (Salman Khan) పేరు కచ్చితంగా ఉంటుంది. ఆయనకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాకుండా.. సల్లు భాయ్ పెళ్లి గురించి బీ టౌన్‌లో చర్చ జరుగుతూనే ఉంటుంది. 50 పదుల వయస్సు దాటినప్పటికీ ఆ చర్చకి ఇంకా ఎండ్ కార్డు పడట్లేదు. ఈ తరుణంలో తాజాగా మరోసారి ఆయన పెళ్లి (Marriage) గురించి చర్చ జరుగుతోంది. అయితే.. అది ఓ పాత వీడియో వల్ల.

juhi.jpg

సల్మాన్ కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో అది. అందులో.. తన పెళ్లి గురించి మాట్లాడాడు. సల్మాన్ మాట్లాడుతూ.. ‘నేను ఓ నటిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అందుకే ఆమె తండ్రిని వెళ్లి అడిగాను. కానీ ఆయన కుదరదని చెప్పేశాడు’ అని చాలా బాధగా చెప్పుకొచ్చాడు. వెంటనే యాంకర్ ఆయన ఎందుకు రిజెక్ట్ చేశాడని అడగగా.. నాకు తెలియదు అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఆ వీడియోలో జూహిచావ్లా (Juhi Chawla) గురించే సల్మాన్ మాట్లాడని పలువురు నెటిజన్లు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ‘సాధారణ కుర్రాళ్లకే అనుకున్నాం.. సల్మాన్‌కి కూడా రిజెక్షన్ తప్పదా?’ అని కొందరు చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Actor Ponnambalam: ‘తమ్ముడే నాపై విష ప్రయోగం చేశాడు.. చేతబడి చేయడంతో..’

Actor Ponnambalam: చిరంజీవి వల్లే బతికున్నా.. అలా అనుకుంటే.. ఏకంగా రూ.40 లక్షలతో..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..


Updated Date - 2023-03-16T13:12:41+05:30 IST