Samantha: సంచలన నిర్ణయం, కారణం ఇదే అని అంటున్నారు
ABN , First Publish Date - 2023-07-05T12:12:14+05:30 IST
సమంత సంచల నిర్ణయం తీసుకుంది, సినిమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం సగం పూర్తి చేసి వున్న ప్రాజెక్ట్ లను పూర్తి చేసి కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటోంది.
అగ్ర నటి సమంత (SamanthaRuthPrabhu) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక సంవత్సరం పాటు తాను సినిమాలకు బ్రేక్ ఇచ్చి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పింది. అయితే ఎందుకు ఇంత సంచలన నిర్ణయం తీసుకుంది అని పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది కూడా. అయితే సమంత (Samantha) కి మళ్ళీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అందువల్లనే ఈ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటోందని కూడా అంటున్నారు. సమంత సినిమా 'శాకుంతలం' #Shaakuntalam ఆమధ్య విడుదలైంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.
రెండు సంవత్సరాల క్రితం సమంత స్వంతంగానే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే సత్తాగల నటి గా పేరు తెచ్చుకుంది. అయితే తరువాత 'యశోద' #Yashoda సినిమా చేస్తున్నప్పుడు ఆమెకి ఆరోగ్య సమస్యలు రావటంతో ఆ సినిమా పూర్తి చేసి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిందని, తరువాత మళ్ళీ ఇండియా వచ్చి కంటిన్యూ చేసిందని చెప్పారు. 'యశోద' #Yashoda విడుదల సమయంలో సమంత తనకి మయోసిటిస్ (Myositis) వ్యాధి సోకిందని, దాని నుంచి రికవరీ అవుతున్నాను అని, ఆ వ్యాధితో చాలా బాధలు అనుభవించానని చెప్పుకొచ్చింది.
అప్పటికే కొంత షూటింగ్ గా చేసిన 'ఖుషీ' #Khushi సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇందులో విజయ దేవరకొండ (VIjayDeverakonda) కనాథనాయకుడు, శివ నిర్వాణ (ShivaNirvana) దర్శకుడు. అలాగే హిందీ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) కూడా ఒప్పుకుంది. అందులో వరుణ్ ధావన్ (VarunDhawan) కథానాయకుడు. గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన 'శాకుంతలం' #Shaakuntalam కూడా ఆమె ఆరోగ్యంగా వున్నప్పుడే ఒప్పుకున్న సినిమా. ఆ సినిమా అయితే పూర్తి చెయ్యగలిగింది కానీ ఆ సినిమా ప్రచారాలకు మాత్రం ఆమె ఆరోగ్యం బాగోలేదని అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఆమెలో చాలా మార్పులు వున్నాయి. 'శాకుంతలం' సినిమా విడుదల అయింది, ప్లాప్ అయింది.
ఇక మళ్ళీ చికిత్స కోసం బాగా విశ్రాంతి ఆవరసమని చాల రోజులు రెస్ట్ తీసుకొని, కోలుకున్నాక, ముందు 'సిటాడెల్' (Citadel) వెబ్ సిరీస్ మొదలెట్టింది. తరువాత 'ఖుషీ' #Kushi సినిమా కూడా షూటింగ్ మొదలెట్టింది. ఇప్పుడు ఈ రెండు కూడా పూర్తి చేసి దృష్టి మొత్తం ఆరోగ్యం మీదే పెట్టాలని అనుకుని, ఈ నిర్ణయం తీసుకుంది అని తెలిసింది. "ఆమెకి ఇప్పుడు చాలా రెస్ట్ అవసరం. కానీ ఆమె తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చెయ్యాలన్న ఉద్దేశంతో రెస్ట్ లేకుండా షూటింగ్స్ పూర్తి చేసింది, అందుకని ఆమె ఆరోగ్యం మళ్ళీ మొదటికి వచ్చింది. అందుకనే ఇప్పుడు కొన్నాళ్ల పాటు పని ఏమీ చెయ్యకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే, ఆమె ఆరోగ్యం కుదుటపడే అవకాశం వుంది," అని ఆమె సన్నిహితులు ఒకరు చెప్పారు. #SamanthaHealth అందుకని ఆమె కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా వుంటాను అని చెప్పింది అని కూడా తెలిసింది.
అయితే ఆమె కొత్త సినిమాలు, ప్రాజెక్ట్స్ ఏమీ ఒప్పుకోలేదని కూడా తెలిసింది. ఎందుకంటే నిర్మాతలు ఇప్పుడు ఆమెతో కొత్త సినిమాలు సైన్ చేసి రిస్క్ తీసుకోదలచుకోలేదు. చాలామంది కథానాయికలు వస్తున్నారు, అందుకని సమంతని ఇటువంటి సమయంలో సైన్ చెయ్యడం మంచికేది కాదని కూడా అనుకుంటున్నారని తెలిసింది. ఏమైనా సమంత ఆరోగ్యంగా, ఆనందంగా మళ్ళీ ఎన్నో సినిమాలు చెయ్యాలని, ప్రేక్షకులని అలరించాలని ఆశిద్దాం.