Varun Tej: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ నాన్ థియేట్రికల్ రైట్స్
ABN , First Publish Date - 2023-09-29T18:13:21+05:30 IST
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి రూ. 50 ప్లస్ కోట్లకు అమ్ముడైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) నటిస్తోన్న తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, ఇప్పటివరకు చూడని భయంకరమైన వైమానిక దాడుల, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. జాతీయ నేపథ్యం, గ్రాండ్ స్కేల్ మేకింగ్‌తో ఈ చిత్రం భారీ బజ్‌ను సంపాదించింది. ఇదీలావుండగా సినిమా యొక్క నాన్-థియేట్రికల్ హక్కులైన శాటిలైట్, డిజిటల్/స్ట్రీమింగ్, ఆడియో అన్ని భాషలకు సంబంధించిన ఇతర హక్కులతో సహా రూ. 50 ప్లస్ కోట్లకి సోల్డ్ అయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ ప్రైస్. (Operation Valentine Non Theatrical Rights)
నాన్-థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాదు.. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్‌కు భారీ డీల్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విజువల్ గ్రాండియర్‌తో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తుండగా, రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించిన మానుషి చిల్లర్ (Manushi Chhillar) తెలుగు అరంగేట్రం చేస్తున్నారు. 2022 విడుదలైన ‘మేజర్’ (Major) భారీ విజయం తర్వాత, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మన దేశంలోని హీరోలను సెలబ్రేట్ చేసుకునే దేశభక్తి కథతో నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహా నిర్మాతలు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakti Pratap Singh Hada) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్ (Aamir Khan), సిద్ధార్థ్ రాజ్ కుమార్ (Siddharth Raj Kumar) రాసిన ఈ చిత్రం 8 డిసెంబర్, 2023న తెలుగు, హిందీ భాషలలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
============================
*Ala Ninnu Cheri: కోడి బాయె లచ్చమ్మదీ.. పాట వదిలిన తలసాని.. హెబ్బా ఏముందిరా?
***************************************
*Agent: ‘ఏజెంట్’ని వదలని కష్టాలు.. ఓటీటీలో విడుదల డౌటే.. ఎందుకంటే?
***************************************
*Pawan Kalyan: జనసేనకు స్టంట్ మేన్ బద్రి విరాళం
*************************************
*Vishal: అదోరకం సనాతన ధర్మం.. విశాల్ వ్యాఖ్యలకు నిర్మాత కౌంటర్
**********************************