RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..
ABN , First Publish Date - 2023-03-21T23:53:10+05:30 IST
నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ (NASA) మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజి విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో.. RRR చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఎడిసన్ నగరం న్యూ జెర్సీలో
నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ (NASA) మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజి విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో.. RRR చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఎడిసన్ నగరం న్యూ జెర్సీలో టెస్లా కార్ లైట్ షో (Tesla Car Light Show) నిర్వహించారు. ఈ షో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షోపై దర్శకధీరుడు రాజమౌళి తాజాగా తన ట్విట్టర్‌లో రెస్పాండ్ అవుతూ.. నాటు నాటు పాటకి మీరిచ్చిన ట్రిబ్యూట్ నాకెంతగానో ఆనందాన్నిచ్చింది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘RRR’ సినిమా విషయానికి వస్తే.. ప్రపంచం అంతా నేడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటోంది. భారతీయ సినిమా అందులోనూ తెలుగు సినిమా గురించి ఈ స్థాయిలో ఇంతకు ముందెన్నడూ క్రేజ్ రాలేదు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లతో రాజమౌళి తెరెకెక్కించిన ఈ చిత్రం.. తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక తెలుగు సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు (Oscar Award) దక్కడం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి ఒక చెరగని అధ్యాయమనే చెప్పుకోవాలి. ట్రిపుల్ ఆర్ టీమ్‌పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్‌పై, నాటు నాటు పాటపై తమ గౌరవాన్ని, ప్రేమను పలు రకాలుగా తెలియజేస్తున్నారు.
తాజాగా.. నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ (NASA) మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఎడిసన్ నగరం న్యూ జెర్సీలో పాపియోనా పార్క్‌లో.. టెస్లా లైట్‌షోను నిర్వహించారు. సుమారు 150 టెస్లా కార్లు ఈ ఫీట్‌లో పాల్గొన్నాయి. ఈ కార్లన్నింటిని RRR షేప్‌లో పార్క్ చేసి ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు లైట్ షోను నిర్వహించారు. ఒక సినిమాకి ఇటువంటి లైట్ షోను నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ లైట్ షో చూడటానికి కేవలం టెస్లా ఓనర్స్ మాత్రమే కాకుండా, దాదాపు 500 మంది హాజరవడం విశేషం. నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు అయినటువంటి వంశీ కొప్పురావూరి (Vamsi Koppuravuri), ఉజ్వల్ కుమార్ కస్తల ఈ కార్యక్రమం సక్సెస్‌లో ప్రముఖ పాత్రను వహించారు. ఎడిసన్ నగర మేయర్ సామ్ జోషి (Edison Township mayor Sam Joshi) మరియు అతని బృందం అతి తక్కువ టైములో సహకరించి దీనిని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధినేత టిజి విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఆధ్వర్యంలో జరగడం విశేషం. విశ్వప్రసాద్ తెలుగులో సక్సెస్‌ఫుల్ సినిమాలను నిర్మించడమే కాకుండా, ప్రపంచానికి తెలుగువాడి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ (RRR) వంటి తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంలో, తాను కూడా ఒక కీలకపాత్రను పోషించి.. ఇలా రికార్డును క్రియేట్ చేయడం విశేషం. ఈ టెస్లా లైట్ షోకి రాజమౌళి ఎలా ఫిదా అయ్యారో.. ఆయన ట్వీట్ చూస్తుంటేనే తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
*********************************
*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్
*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?
*Brahmanandam: వన్ మోర్ అన్నావంటే కృష్ణవంశీని చంపేస్తానన్నాడు
*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?
*Karthikeya 2: హీరో నిఖిల్‌కి ఉత్తమ నటుడి అవార్డ్
* Ram Charan and NTR: మరోసారి ఒకే స్టేజ్‌పై చరణ్-ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
*Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు
*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది
*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్
*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది