Tamannaah Bhatia: ఒకేసారి రెండు కలలు నెరవేరాయి

ABN , First Publish Date - 2023-02-17T22:48:01+05:30 IST

సుధీర్ఘకాలంగా తనకున్న రెండు కలలు ఒకేసారి నెరవేరాయని మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) వెల్లడించింది. కొన్నేళ్ళుగా హీరోయిన్‌గా

Tamannaah Bhatia: ఒకేసారి రెండు కలలు నెరవేరాయి
Tamannaah Bhatia

సుధీర్ఘకాలంగా తనకున్న రెండు కలలు ఒకేసారి నెరవేరాయని మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) వెల్లడించింది. కొన్నేళ్ళుగా హీరోయిన్‌గా రాణిస్తున్న ఆమెకు తాజాగా లక్కీఛాన్స్‌ వరించింది. తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలలో ఇద్దరు సూపర్‌స్టార్లతో నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకుంది. తమిళంలో రజనీకాంత్‌ (Rajinikanth), తెలుగులో చిరంజీవి (Chiranjeevi) చిత్రాల్లో నటించడంపై ఆమె హర్షం వ్యక్తంచేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘కొన్నేళ్ళుగా తమిళంలో అవకాశాలే లేని నాకు... ఏకంగా రజనీకాంత్‌గారి ‘జైలర్‌’ (Jailer) చిత్రంలో నటించే అవకాశం వస్తుందనుకోలేదు. ఇది ఇప్పటికీ ఒక కలగానే ఉంది. అలా సూపర్‌స్టార్‌తో నటించాలన్న కోరిక నెరవేరింది. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవిగారితో ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar) చిత్రంలో నటిస్తున్నాను. గతంలో ఆయనతో కలిసి ‘సైరా నరసింహా రెడ్డి’ (Sye Raa Narasimha Reddy)లో కలిసి పనిచేశాను. ఆ సినిమాలో నటించినా నా కోరిక నెరవేరలేదు. ఇప్పుడు చేస్తున్న ‘భోళా శంకర్‌’ చిత్రంలో మాత్రం హీరోయిన్‌ పాత్ర. చిరంజీవిగారితో కలిసి డ్యాన్స్‌ (Dance) చేయాలనేది నా కోరిక. అదికూడా ఈ చిత్రంతో తీరబోతోంది. ఇలా ఒకేసారి రెండు కలలు నెరవేరుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది’ అని తమన్నా చెప్పుకొచ్చింది.

తమన్నా (Tamanna) సినిమాల సంగతి ఇలా ఉంటే.. ప్రస్తుతం ఆమె నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లుగా పిక్స్ దర్శనమిస్తున్నాయి. త్వరలోనే వారిద్దరి వివాహం ఉంటుందనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై వారిద్దరూ క్లారిటీ ఇవ్వడం లేదు కానీ.. కలిసి అనేక చోట్ల మాత్రం దర్శనమిస్తున్నారు. (Tamanna Dream)

Updated Date - 2023-02-17T22:48:02+05:30 IST