Taraka Ratna : తారకరత్నతో దిగిన చివరి ఫొటో పోస్ట్ చేసిన అలేఖ్యారెడ్డి.. కంటతడి పెడుతున్న ఫ్యాన్స్..
ABN , First Publish Date - 2023-02-27T23:03:32+05:30 IST
టాలీవుడ్ సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri ) మరణం నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తారకరత్న సతీమణి
టాలీవుడ్ సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri ) మరణం నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి, పిల్లలను ఓదార్చటం ఎవరి వల్ల కావడం లేదు. ఈ బాధాకర ఘటన నుంచి ఆ కుటుంబం ఇప్పట్లో కోలుకునేలాలేదు. ఈ క్రమంలో తారకరత్నతో గడిపిన సమయాన్ని, భర్తతో పాత జ్ఞాపకాలను అలేఖ్యారెడ్డి గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ అయ్యారు.
మళ్లీ వినాలని ఉంది..!
‘ఇదే మా చివరి ఫొటో. ట్రిప్ అనే విషయం నా హృదయాన్ని ముక్కలు చేస్తోంది. ఇదంతా ఓ కలలా మారి.. నువ్వు తిరిగొచ్చి నన్ను అమ్మా బంగారు అని మళ్లీ పిలిస్తే వినాలని ఉంది’ అని అలేఖ్యారెడ్డి ఎమోషనల్ అయ్యారు. తారకరత్న, అలేఖ్యారెడ్డి, ముగ్గురు పిల్లలు కలిసి తిరుమలకు వెళ్లినప్పుడు ఈ ఫొటో తీసుకున్నారు. ఇదే చివరి ఫొటో అంటూ అలేఖ్య ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఇది చూసిన అభిమానులు కంటతడిపెట్టేస్తున్నారు. ‘వదిన మీరు చాలా ధైర్యంగా ఉండాలి.. పిల్లలకి ధైర్యం చెప్పండి.. ఈ ఫొటో చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘మీకు మేమున్నాం.. మీరు ధైర్యంగా ఉండాలి’ అంటూ మరికొందరు నెటిజన్లు ధైర్యం చెబుతున్నారు. ‘నందమూరి ఫ్యామిలీ, ఫ్యాన్స్ అంతా మీకు తోడుగా ఉంటాం..’ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
పుట్టిన రోజు పోస్ట్ ఇదీ..
‘మనం కలిసి ఉండేందుకు ఎంతో పోరాడాం.. ఆఖరి వరకూ పోరాడుతూనే ఉన్నాం. మన జీవితం అంత సులభంగా సాగలేదు. మనం కార్లలో నిద్రపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో దూరం ప్రయాణించాం. నువ్వో యోధుడివి నానా.. నువ్వు మమ్మల్ని ప్రేమించినట్లుగా ఎవరూ ప్రేమించలేరు’ అని అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్నతో తనకున్న భర్తతో పాత జ్ఞాపకాలను రోజుకో పోస్ట్‌తో అలేఖ్యారెడ్డి గుర్తు చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
*********************************