Navdeep Madhapur Drugs Case:: డ్రగ్స్ సప్లై చేసిన అతను తెలుసు కానీ, అతనితో....

ABN , First Publish Date - 2023-09-23T18:24:33+05:30 IST

తెలంగాణ నార్కోటిక్ పోలీసులు సుమారు ఆరుగంటల పాటు నటుడు నవదీప్ ని ప్రశ్నించినట్టుగా తెలిసింది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశాడని, అలాగే కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానంగా చెప్పాడని తెలిసింది. డ్రగ్ సప్లయర్ రాంచందర్ తెలుసు అని, కానీ..

Navdeep Madhapur Drugs Case:: డ్రగ్స్ సప్లై చేసిన అతను తెలుసు కానీ, అతనితో....
File picture of Actor Navdeep

మాదాపూర్ డ్రగ్స్ కేసులో #MadhapurDrugsCase తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన నటుడు నవదీప్ (Navdeep) ని తెలంగాణ నార్కోటిక్స్ టీము ఈరోజు విచారించింది.అయితే ఈ విచారణలో నవదీప్ కి చాలా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. నార్కోటిక్ విభాగం ఎస్పీ సునీత రెడ్డి, ఏసిపి నరసింగ రావుతో కూడిన బృందం నవదీప్ ని విచారించినట్టుగా తెలిసింది. దాదాపు ఆరుగంటలకి పైగా ఈ విచారణ సాగింది. ఈ విచారణ బృందం గట్టి ఆధారాలను నవదీప్ ముందు పెట్టి ప్రశ్నలు సాధించినట్టు తెలిసింది. Narootics Control Bureau

అయితే నవదీప్ చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో డ్రగ్ సప్లయర్ అయినటువంటి రామచందర్ తో పది సంవత్సరాల నుండి పరిచయం వుంది, కానీ అతనితో ఆర్ధిక పరమైన లావాదేవీలు తప్ప, డ్రగ్స్ కు సంబంధించి ఎటువంటి సంబంధాలు లేవని నవదీప్ చెప్పినట్టుగా తెలిసింది. అలాగే రాంచందర్ తో నవదీప్ వున్న ఫోటోలను, పబ్స్ లో పార్టీలలో వున్న ఫోటోలను కూడా చూపించారని, దానికి నవదీప్ అతను కేవలం స్నేహితుడిగా కలిశానని మాత్రమే చెప్పారని చెపుతున్నారు. Narcotic Police

navadeep.jpg

ఈనెల 14న మాదాపూర్ లోని ఒక అపార్టుమెంట్ లో నార్కోటిక్ అధికారులు, పోలీసులు కలిసి సుమారు పది లక్షల రూపాయల విలువుగల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవటమే కాకుండా, నలుగురు నైజీరియన్స్, ఒక సినిమా దర్శకుడు, నలుగురు ఇతర వ్యక్తుల్ని కూడా అరెస్టు చేశారు. ఇందులో రాంచందర్ అనే వ్యక్తి డ్రగ్ సప్లయర్ అని, అతనితో నవదీప్ కి సంబంధాలు ఉన్నాయని పోలీసుల ఆరోపణ. అందుకనే నవదీప్ ని ఈరోజు సుమారు ఆరు గంటలపాటు నార్కోటిక్ పోలీసులు విచారించారు అని తెలిసింది.

అయితే బయటకి వచ్చిన తరువాత నవదీప్ తనకేమీ డ్రగ్స్ తో సంబంధం లేదని, తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని చెపుతున్నాడు. అయితే డ్రగ్ సప్లయర్ రాంచందర్ తనకి తెలుసు అని, కానీ అతనితో డ్రగ్స్ తీసుకోలేదు అని, అది కూడా పదేళ్ల క్రితం విషయం అని చెపుతున్నాడు నవదీప్. గతంలో కూడా ఒక పబ్ ని నిర్వహించినప్పుడు తన మీద ఆరోపణలు వచ్చాయని, అప్పుడు కూడా పిలిచారని, విచారించారని చెప్పాడు. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను అని చెప్పాడు. పాత ఫోను రికార్డులు తీసి దర్యాప్తు చేసారని చెప్పాడు. అవసరం అయితే మళ్ళీ పిలుస్తామని కూడా చెప్పారని నవదీప్ చెప్పాడు.

Updated Date - 2023-09-23T18:24:33+05:30 IST