The Elephant Whisperers: వారి ఆనందానికి ఆస్కార్ అవార్డ్ ఏం సరిపోతుంది?
ABN , First Publish Date - 2023-03-24T17:32:36+05:30 IST
ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడంతో ఇండియన్ సినిమా స్థాయి ఇదంటూ అంతా సంబరాలు జరుపుకున్నారు. కానీ, డైరెక్ట్‌గా ఆస్కార్‌కి నామినేట్ అవడమే కాకుండా.. తొలి ప్రయత్నంలోనే ఆస్కార్ అవార్డును అందుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers)కు మాత్రం
దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ఆస్కార్ రేసులో ఉన్నప్పటి నుంచి.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆస్కార్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రేసు మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ కళ్లన్నీ దీనిపైనే ఉన్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ఫైనల్‌గా ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడంతో ఇండియన్ సినిమా స్థాయి ఇదంటూ అంతా సంబరాలు జరుపుకున్నారు. కానీ, డైరెక్ట్‌గా ఆస్కార్‌కి నామినేట్ అవడమే కాకుండా.. తొలి ప్రయత్నంలోనే ఆస్కార్ అవార్డును అందుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers)కు మాత్రం ఆర్ఆర్ఆర్ స్థాయిలో ప్రచారం, క్రేజ్ దక్కలేదనే చెప్పుకోవాలి. అయితేనేం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్ చూస్తుంటే.. ‘ఆర్ఆర్ఆర్’ను కూడా అంతా మరిచిపోతున్నారు. అంతలా ఆ పిక్ నెట్టింట్లో సందడి చేస్తోంది.
ఇంతకీ ఈ పిక్‌లో ఏముందంటే.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) అనేది డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ (Best Documentary Short Film). ఇది రెండు అనాథ ఏనుగు పిల్లల కథ. అమ్ము, రఘు అనే రెండు అనాథ ఏనుగు పిల్లలను ఆదరించిన దంపతుల స్టోరీ ఇది. మొత్తంగా 42 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో కనిపించేది కేవలం ఇద్దరు వ్యక్తులు, రెండు ఏనుగులు మాత్రమే. ఆ ఏనుగులు అమ్ము (Ammu), రఘు (Raghu) కాగా.. ఆ దంపతులు బొమ్మన్ (Bomman), బెల్లీ (Bellie). రియల్ లైఫ్‌లో కూడా అమ్ము, రఘుల సంరక్షణను వీరిద్దరే చూస్తుండటం విశేషం. ఇప్పుడీ ఇద్దరి చేతుల్లోకి ఆస్కార్ చేరింది. అమెరికాలో జరిగిన వేడుకలో చిత్ర నిర్మాత గునీత్ మొంగా (Guneet Monga), దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్ (Kartiki Gonsalves) అవార్డును అందుకున్నారు. ఇప్పుడా అవార్డు రావడానికి కారణమైన బొమ్మన్, బెల్లీ చేతికి మేకర్స్ ఆస్కార్ అవార్డును అందించారు. ఈ అవార్డును అందుకున్న వారి సంతోషం చూస్తుంటే.. నిజంగా ‘ఆ సంతోషం ముందు ఆస్కార్ అవార్డు చిన్నబోయిందేమో’ అని అనిపిస్తుంది. ఆ ఇద్దరి సంతోషాన్ని చూసి నెటిజన్లు కూడా దాదాపు ఇలాంటి కామెంట్సే చేస్తుండటం గమనార్హం.
అయితే ఈ పిక్‌లో వారితో పాటు అమ్ము, రఘు కూడా ఉండాల్సింది. కానీ.. అవి రెండూ ఇటీవల మిస్ అయినట్లు బొమ్మన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతమంది తాగుబోతులను తరుముకుంటూ.. రెండు ఏనుగులూ తమిళనాడు (Tamil Nadu)లోని కృష్ణగిరి (KrishnaGiri) అరణ్యంలోకి వెళ్లి.. అదృశ్యం అయినట్లుగా ఆయన చెప్పారు. ఇంకా వాటి జాడ తెలియరాలేదని కూడా ఆయన ప్రకటించారు. అవి రెండూ కూడా ఈ పిక్‌లో ఉంటే.. మరింత ఆనందం తోడయ్యేది. ఇక ఈ పిక్‌పై నెటిజన్లే కాకుండా.. సెలబ్రిటీలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ తన ట్విట్టర్ వేదికగా ఈ పిక్ షేర్ చేసి.. ‘ఆస్కార్ అవార్డుతో వారిని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వారిని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన టీమ్‌కు ధన్యవాదాలు’ అని తెలిపారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) డాక్యుమెంటరీ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకురాలు కార్తికీకి (Kartiki) ఇది తొలి చిత్రం. తొలి చిత్రంతోనే ఆస్కార్ అందుకున్న దర్శకురాలిగా కార్తికి గోన్‌సాల్వెస్ రికార్డును క్రియేట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
*********************************
*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?
*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..
*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!
*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు
*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు
*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?
*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?
*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?
*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?