Vijayakanth: విషమంగా విజయ్ కాంత్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

ABN , First Publish Date - 2023-11-29T16:23:34+05:30 IST

తమిళ అగ్ర నటుడు, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయ్ కాంత్ (Vijayakanth) ఆరోగ్యానికి సంబంధించి మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆరోగ్యంపై ఇటీవల ఎటువంటి వార్తలు వినిపించాయో తెలిసిందే. మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఆయన హెల్త్‌పై MIOT హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

Vijayakanth: విషమంగా విజయ్ కాంత్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల
Vijayakanth

తమిళ అగ్ర నటుడు, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయ్ కాంత్ (Vijayakanth) ఆరోగ్యానికి సంబంధించి మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆరోగ్యంపై ఇటీవల ఎటువంటి వార్తలు వినిపించాయో తెలిసిందే. అయితే డాక్టర్లు ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడంతో వార్తలు కాస్త సద్దుమణిగాయి. అయితే తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ.. పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. మరోసారి ఆయనకు చికిత్స అందిస్తున్న MIOT హాస్పిటల్ డాక్టర్స్ వివరణ ఇస్తూ.. హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.

‘‘విజయ్ కాంత్ ఆరోగ్యం కాస్త మెరుగుపడినా.. గత 24 గంటలుగా ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్‌గానే ఉంది. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తున్నప్పటికీ.. పరిస్థితి విషమంగానే ఉంది. అతడు కోలుకోవడానికి పల్మనరీ చికిత్సను వైద్య నిపుణులు సిఫార్సు చేశారు. అంతేకాదు, ఆయన కోలుకోవడానికి మరో 14 రోజుల పాటు నిరంతర చికిత్స అవసరం అని డాక్టర్లు వెల్లడించారు’’ (Vijayakanth Health Bulletin) అని MIOT హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 18న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఆయన డయాబెటిస్‌తో పాటు.. లివర్ సమస్యతో బాధపడుతున్నారు. వీటితో పాటు జలుబు, దగ్గు, గొంతునొప్పితో శ్వాసతీసుకోవడంతో ఇబ్బంది పడుతున్న ఆయనని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో జాయిన్ చేయగా.. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. డయాబెటిస్ కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన మూడు వేళ్లను తొలగించిన విషయం తెలిసిందే.


MIOT.jpg

తమిళనాట పురచ్చీ కళైంగార్(విప్లవ వీరుడు) అని ముద్దుగా పిలుచుకునే విజయ్ కాంత్ (Vijayakanth) గురించి తెలుగు వాళ్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ నటుడు ఇప్పటివరకు 150 సినిమాలలో నటించినప్పటికీ తమిళం మినహా వేరే భాషలో ఆయన సినిమా చేయలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, కన్నడ భాషల్లో డబ్ అయి మంచి పేరు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా 90లలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమా చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయి టాలీవుడ్‌లోనూ విజయ్ కాంత్‌కి స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు టాలీవుడ్‌లో విడుదలయ్యాయి. హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయన.. నటనకు స్వస్తి చెప్పి ఆ తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసి.. DMDK అనే పార్టీని స్థాపించి 2006, 2011లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన భార్య ప్రేమలత పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితితో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గెట్ వెల్ సూన్ మెసేజ్‌లతో సోషల్ మీడియాలో విజయ్ కాంత్ పేరు ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Double iSmart: మరో 100 రోజుల్లో థియేటర్లలో రచ్చ రచ్చే..

***********************************

*విలన్‌గా నటించాలనే కోరిక నెరవేరింది: యంగ్ హీరో

*************************************

*Shashtipoorthi: ‘లేడీస్ టైలర్’ జంట ‘షష్టిపూర్తి’ ఎంత వరకు వచ్చిందంటే..

***********************************

Updated Date - 2023-11-29T16:23:35+05:30 IST