Aamir Khan: కూతురి పెళ్లి.. కంటతడి పెట్టిన అమీర్‌ఖాన్
ABN , Publish Date - Jan 11 , 2024 | 06:41 PM
బాలీవుడ్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమీర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఐరా - నుపుర్ శిఖరే ఒక్కటయ్యారు. ఈ సమయంలో అమీర్ ఖాన్ బావోద్వేగానికి లోనయ్యారు.
బాలీవుడ్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమీర్‌ఖాన్ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్ (Ira Khan) వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సోమవారం (08.01.2024)న ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇరు కుటుంబాల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అనంతరం మళ్లీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా బుధవారం సాయంత్రం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఐరా - నుపుర్ శిఖరే ఒక్కటయ్యారు. బాలీవుడ్ ప్రముఖుల కోసం జనవరి 13న రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా పెళ్లి అనంతరం ఉంగరాలు మార్చుకునే సమయంలో అమీర్ ఖాన్ (Aamir Khan) బావోద్వేగానికిలోనై కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. ఈ వీడియోను నెటిజన్లు సోషల్‌మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.