Aditi Rao Hydari: అందుకే ఎంగేజ్‌మెంట్‌ గురించి బయటకు చెప్పా

ABN , Publish Date - May 02 , 2024 | 04:26 PM

హీరోయిన్  అదితిరావు హైదరీ - సిద్థార్థ్‌ కొంతకాలంగా రిలేషన్లో  ఉన్న సంగతి తెలిసిందే! 'మహా సముద్రం’ చిత్రం నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Aditi Rao Hydari:  అందుకే ఎంగేజ్‌మెంట్‌ గురించి బయటకు చెప్పా


హీరోయిన్  అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) - సిద్థార్థ్‌ (Siddharth)కొంతకాలంగా రిలేషన్లో  ఉన్న సంగతి తెలిసిందే! 'మహా సముద్రం’ (Maha samudram) చిత్రం నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇరుకుటుంబాల అంగీకారంతో  మార్చి 27న వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్‌ రంగనాథ స్వామి దేవాలయంలో వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. దీనిపై అదితి స్పందించారు. నిశ్చితార్థం విషయం బయట పెట్టడానికి కారణం చెప్పారు. తన తల్లి కోరికమేరకు నిశ్చితార్థం జరిగినట్లు పోస్ట్‌ పెట్టానని అన్నారు.



‘‘జీవితంలో జరిగే ముఖ్యమైన వాటిని ప్రత్యేక ప్రదేశంలో చేసుకోవాలని అందరూ అనుకుంటారు. నేను నా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఆ దేవాలయంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. మా అమ్మ కారణంగానే ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను పోస్ట్‌ చేశాను. మా పెళ్లి గురించి తెలుసుకోవాలని ఎంతోమంది మా అమ్మకు ఫోన్లు చేశారు. నిరంతరం వచ్చిన కాల్స్‌కు ఆమె సమాధానం చెప్పలేకపోయింది. ‘దయచేసి నీ ఎంగేజ్‌మెంట్‌ విషయం మీడియాకు వెల్లడించు’ అని కోరింది. దీంతో నేను, సిద్థార్థ్‌ దీనిపై పోస్ట్‌లు పెట్టాం’’ అని అదితిరావు హైదరీ తెలిపారు. తాజాగా ఆమె నటించిన హీరామండి సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో  స్ట్రీమింగ్  అవుతోంది.

Jr NTR: ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ లేటెస్ట్‌ అప్‌డేట్‌!

Read More: Tollywood, Cinema News

Updated Date - May 02 , 2024 | 04:27 PM