Aditi rao hydari: సిద్ధార్థ్ తో ప్రేమ, పెళ్లి.. అదితీ చెప్పిన సంగతులు
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:23 PM
హీరో సిద్థార్థ్తో(Siddharth) ప్రేమ,పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అదితిరావు హైదరీ(Aditi Rao Hydari). నిశ్చితార్థం జరిగిన దేవాలయంలోనే పెళ్లి కూడా ఉంటుందని అన్నారు. వీ
హీరో సిద్ధార్థ్ తో(Siddharth) ప్రేమ,పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అదితిరావు హైదరీ(Aditi Rao Hydari). నిశ్చితార్థం జరిగిన దేవాలయంలోనే పెళ్లి కూడా ఉంటుందని అన్నారు. వీరిద్దరూ కలిసి తొలిసారి ‘మహాసముద్రం’ చిత్రంలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పాడింది. అది ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది. ఈ మేరకు అదితీ రావు హైదరీ మాట్లాడుతూ ‘‘మా నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం. అన్ని విషయాలు ఆమెతో షేర్ చేసుకునేదాన్ని. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్ ప్రారంభించారు. అది నాకెంతో ప్రత్యేకం. నా చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపాను. కొన్నేళ్లక్రితం ఆమె కన్నుమూశారు. ఈ విషయం సిద్థార్థ్‌కు తెలుసు. ఓ రోజు నా వద్దకు వచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. మోకాళ్లపై కూర్చొని.. అతను నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడు’’ అని అదితి చెప్పారు. అతను ప్రేమను వ్యక్తపరిచిన తీరు ఎంతో నచ్చిందన్నారు.
పెళ్లి వేదిక గురించి మాట్లాడుతూ ‘‘వనపర్తి జిల్లా శ్రీరంగాపురం లో రంగనాథస్వామి ఆలయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. మా నిశ్చితార్థం అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే ఉంటుంది. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక మేమిద్దరం అనౌన్స్ చేస్తాం’’ అని అన్నారు. ఇటీవల నిశ్చితార్థం ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా జరిగిందని వచ్చిన కామెంట్లను సిద్ధార్థ్ ఖండించిన విషయం తెలిసిందే!