Akshay Kumar: నా కట్టె కాలే వరకు పని చేస్తూనే ఉంటా..

ABN , Publish Date - Aug 02 , 2024 | 08:59 PM

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన మాత్రం గత కొంతకాలంగా హిట్ అనేది పడటం లేదు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన 10కి పైగా సినిమాలు ప్లాప్స్‌గా‌ నిలిచాయి. దీనిపై అక్షయ్ తన లేటెస్ట్ సినిమా ‘ఖేల్ ఖేల్ మే’ ప్రమోషన్స్‌లో స్పందించారు.

Khel Khel Mein Trailer Release Event

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన మాత్రం గత కొంతకాలంగా హిట్ అనేది పడటం లేదు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన 10కి పైగా సినిమాలు ప్లాప్స్‌గా‌ నిలిచాయి. దీనిపై అక్షయ్ తన లేటెస్ట్ సినిమా ‘ఖేల్ ఖేల్ మే’ (Khel Khel Mein) ప్రమోషన్స్‌లో స్పందించారు. హిట్టు, ఫ్లాప్ అనేది పక్కన పెడితే.. నా కట్టె కాలే వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

Also Read- Thiragabadara Saami Review: రాజ్ తరుణ్ హిట్ అందుకున్నాడా లేదా? 

ఆయన మాట్లాడుతూ.. ‘‘పరాజయాలపై నేను ఎక్కువగా ఆలోచించను. నా నాలుగైదు సినిమాలు వర్కౌట్ కాలేదు నిజమే. ఈ టైమ్‌లో నాకు చాలా మెసేజ్‌లు వచ్చాయి.‌ ఆ మెసేజ్‌లు చూసినప్పుడు ఎందుకో అవన్నీ సంస్మరణ సందేశాలుగా తోచాయి. అలాంటి వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. నేనేం చనిపోలేదు. ఒక జర్నలిస్ట్ కూడా.. చింతించకండి, మీరు తిరిగి వస్తారు.. అని చెప్పి వ్రాశాడు. అతను ఎందుకలా రాశాడో నాకు అర్థం కాలేదు. నేను అతనిని పిలిచి, ఎందుకు అలా రాశావని అడిగాను. తిరిగి రావటం అంటే ఏమిటి? నేను ఎక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నానుగా.. అని అడిగాను. (Akshay Kumar About Flops)


Akshay-Kumar.jpg

సో.. ఎవరు ఏమన్నా పట్టించుకోను.. నేను పని చేస్తూనే ఉంటాను. ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేసి పనికి బయలుదేరి ఇంటికి తిరిగి వస్తాను. డబ్బు సంపాదించడానికి కష్టపడతాను కానీ ఎవరినీ నేను సహాయం అడగను. నన్ను కాల్చివేసే వరకు నేను పని చేస్తూనే ఉంటాను’’ అని చెప్పుకొచ్చారు అక్షయ్ కుమార్. ‘ఖేల్ ఖేల్ మే’ చిత్ర విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్, తాప్సీ (Taapsee Pannu), వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకుడు. ఈ చిత్రం 2016 ఇటాలియన్ కామెడీ థ్రిల్లర్ ‘పర్ఫెక్ట్ స్టేంజర్స్’కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Khel Khel Mein Trailer Released)

Read Latest Cinema News

Updated Date - Aug 02 , 2024 | 08:59 PM