Alia Bhatt: అలియా వేసుకున్న ఆ నెక్లెస్ ఖరీదు ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు
ABN , Publish Date - Apr 01 , 2024 | 11:33 AM
అలియా భట్ ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర నటీమణిగా చెలామణి అవుతోంది. ఒక్క భారతదేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్న అలియా లండన్ లో ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. అందరి దృష్టి ఆమె ధరించిన డైమండ్ నెక్లెసు మీదే వుంది, ఎందుకంటే ఆ ఆభరణం ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు
బాలీవుడ్ అగ్ర నటి, రణబీర్ కపూర్ భార్య అయిన అలియా భట్ నిధులు సేకరించేందుకు లండన్ లో ఈమధ్య సలాం బాంబే ఫౌండేషన్ ద్వారా హోప్ గాలా అనే ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ నిధులు భారతదేశంలో వున్న కొంతమంది నిరుపేద టీనెజర్స్ కోసమని వినియోగిస్తున్నారు. ఈ చారిటీ కోసం అలియా భట్ ముస్తాబుగా తయారయ్యి వెళ్ళింది. ఒక ఖరీదైన గౌను వేసుకొని మెడలో ఒక బంగారు నెక్లెస్, దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఒక సఫైర్ రింగ్‌ని ఎంచుకుంది. ఆమె వేసుకున్న ఆ నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే షాకవుత్తారు.
అలియా భట్ మెడలో వేసుకున్న ఆ డైమండ్ నెక్లెస్, అందులో నీలిరంగు సఫైర్ వుంది చూసారా, వాటి ధర సుమారు రూ. ₹20 కోట్లు ఉంటుంది. నిధుల సమీకరణ కోసం అలియా భట్ లండన్ వెళ్లి, అక్కడ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసురాలు హర్షదీప్ కౌర్, హాస్యనటుడు రోహన్ జోషి, దర్శకుడు గురీందర్ చద్దా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలియా భట్ సామాజిక వేత్త నటాషా పూనావాలాతో కలిసి కెమెరాలకు ఫోజులిచ్చింది.
సలామ్ బాంబే అనే ఒక స్వచ్ఛంద సంస్థకు అలియా మద్దతు ఇవ్వటం కోసం లండన్ వచ్చి ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ స్వచ్చంద సంస్థ ముంబాయి లోని పేద పిల్లలకు చదువుతో పాటు వాళ్ళకి అన్ని రకాలైన మద్దతు ఇచ్చేందుకు ఆర్థికంగా సాయపడుతూ ఉంటుంది. ఇక కెరీర్ పరంగా చూస్తే కనక అలియా ఈమధ్యనే 'జిగ్రా' సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు, ఈ చిత్రం సెప్టెంబర్ 2024లో థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వస్తున్న 'జీ లే జరా'లో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌లతో కలిసి అలియా కూడా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు అని తెలిసింది.