Amitabh Bachchan: అలాంటి వార్తలతో నన్ను చాలా బాధపెట్టారు...  బిగ్ బీ

ABN , Publish Date - Nov 21 , 2024 | 08:31 PM

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌ దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆయా కథనాలపై అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా స్పందించారు.

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌(Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai Bachchan) దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆయా కథనాలపై అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) తాజాగా స్పందించారు. తన కుటుంబం గురించి వస్తోన్న కథనాలను ఉద్దేశించి గురువారం ఆయన తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. అవన్నీ అసత్య ప్రచారాలు మాత్రమేనని అన్నారు. ‘‘విభిన్నంగా ఉండటానికి, జీవితంలో దాని ఉనికిని విశ్వసించడానికి అపారమైన ధైర్యం, చిత్త శుద్థి అవసరం. నా కుటుంబం గురించి నేను అరుదుగా మాట్లాడుతుంటా. ఎందుకంటే అది నా సామ్రాజ్యం. దాని గోపత్యను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అసత్య ప్రచారాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. పూర్తి సమాచారం తెలుసుకోకుండా అవాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుంటారు కొందరు. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది నిజమైన వృత్తి ధర్మం. అందరి దృష్టిని ఆకర్షించడం కోసం వారు చేసే ఈ పనిని నేను సవాలు చేయాలనుకోవడం లేదు. సమాజం కోసం వారు చేస్తోన్న సేవలను ప్రశంసిస్తాను. చట్టపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వారు ప్రశ్న సూచకంగా సమాచారం ఇచ్చి ఇతరులు నమ్మేలా చేస్తుంటారు’’ అని అమితాబ్‌ బచ్చన్‌ రాసుకొచ్చారు. 


ఇలాంటి అవాస్తవ ప్రచారాల వల్ల తాను బాధపడినట్లు ఆయన బ్లాగ్‌లో పేర్కొన్నారు బిగ్ బీ. విషయం ఏదైనా సరే పూర్తి సమాచారం తెలుసుకున్నాకే వార్తగా వండితే బాగుంటుందని పేర్కొన్నారు. అభిషేక్‌ - ఐశ్వర్య విడాకుల వార్తల నేపథ్యంలోనే ఆయన ఈ పోస్ట్‌ పెట్టినట్లు టాక్‌ నడుస్తోంది. 2007లో అభిషేక్‌  - ఐశ్వర్య వివాహం జరిగింది. పలు ఈవెంట్స్‌కు వీరిద్దరూ కలిసి హాజరు కాకపోవడంతో విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలోనూ అమితాబ్‌ కుటుంబం, ఐశ్వర్య రాయ్‌ విచిడిగా ఫొటోలు దిగారు. అభిషేక్‌ కూడా కుటుంబంతోనే ఫొటోలు దిగాడు. దీంతో ఈ టాక్‌ మరింత ఎక్కువైంది. వీటికి చెక్‌ పెడుతూ పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌కు ఐశ్వర్య వెడ్డింగ్‌ రింగ్‌ ధరించి హాజరయ్యారు.

Updated Date - Nov 21 , 2024 | 08:31 PM