Ananya Panday: క్రికెటర్ హార్దిక్ పాండ్య విడాకులు, అనన్య పాండే కారణమా...

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:59 PM

బాలీవుడ్ నటి అనన్య పాండే ఇప్పుడు చాలా సీరియస్ గా క్రికెటర్ హార్దిక్ పాండ్యతో డేటింగ్ లో ఉందని బాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు హార్దిక్ పాండ్య విడాకులు ఇవ్వటానికి అనన్య పాండే కారణం అని కూడా అంటున్నారు. మరి ఈ ఇద్దరూ అధికారికంగా ఏమైనా చెప్తారా, లేక కొన్నాళ్ళు ఎదురు చూస్తారా అనే విషయంపై చర్చ నడుస్తోంది

Hardik Pandya and Ananya Panday at Anant Ambani and Radhika wedding

కొన్ని రోజుల క్రితం క్రికెటర్ హార్దిక్ పాండ్య, అతని భార్య నటాషా స్టాంకోవిక్ తాము విడిపోతున్నట్టుగా సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య చెడింది అనే వార్తలు విశేషంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకి వీరిద్దరూ తాము విడిపోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. నటాషా స్టాంకోవిక్ సెర్బియా దేశస్థురాలు, మోడల్, నటి కూడాను. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన 'సత్యాగ్రహ'తో బాలీవుడ్ చిత్రాలలో అడుగుపెట్టింది. అలాగే ఆమె 2014లో బిగ్ బాస్ 8లో కూడా పాల్గొంది. ఆమె వివాహం హార్దిక్ పాండ్య తో మే 31, 2020 న జరిగింది. అదే సంవత్సరం జులై 30న వీరికి ఒక కుమారుడు అగస్త్య కలిగాడు. (Cricketer Hardik Pandya is dating Bollywood Actress Ananya Panday?)

ananyapandaywithcar.jpg

అయితే హార్దిక్ పాండ్య విడాకులు అవడానికి ఒక బాలీవుడ్ నటి కారణం అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి అనన్య పాండే, హార్దిక్ పాండ్య తో డేటింగ్ లో వుంది అని బాలీవుడ్ మీడియా రాస్తున్నారు. ఈమధ్య జరిగిన అంబానీ కుమారుడి పెళ్ళిలో వీరిద్దరూ కలిసి చాలా హంగామా చేశారని, అప్పుడే అందరికీ వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టుగా అర్థం అయిందని వార్తలు రాస్తున్నారు. (Some media reports says that Bollywood actress Ananya Panday is the reason for cricketer Hardik Pandya's divoce with his wife Natasha)

Hardik-and-Ananaya-2.jpg

అలాగే అనన్య పాండే, హార్దిక్ పాండ్య మధ్య చాలా మాటలు కూడా నడిచాయని, ఇద్దరూ చాలా ఆనందంగా, సంతోషంగా వున్నారని మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ బాలీవుడ్ అమ్మడి వల్లే హార్దిక్ పాండ్య వివాహం విడాకుల వరకు వచ్చిందని కూడా అంటున్నారు. అలాగే వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు అని కూడా నెటిజన్స్ చెపుతున్నారు. (Hardik Pandya and Bollywood actress Ananya Panday is following each other on Instagram) ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరూ చాలా సీరియస్ గా వున్నారు అని అర్థం అవుతోంది. ఇంతకీ హార్దిక్ పాండ్య, అనన్యలు తమ రిలేషన్ షిప్ ని బయటకి చెప్తారా, లేక ఇప్పుడే కదా విడాకులు అయ్యాయి, కొన్నాళ్లు ఆగి చెప్పాలా అనే విషయంపై కూడా చర్చ నడుస్తోంది. ఈమధ్యనే అనన్య పాండే ఒక కొత్త లక్సరీ కారు కూడా కొనింది.

అనన్య ఇంతకు ముందు ఆదిత్య రాయ్ కపూర్ తో డేటింగ్ లో వున్నట్టుగా కూడా బాలీవుడ్ లో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి లంచ్, డిన్నర్ లకి వెళ్లిన ఫోటోలు బయటకి వచ్చాయి కూడా. అయితే వీరిద్దరూ మొన్న మార్చి నెలలో విడిపోతున్నట్టుగా తమ దగ్గరి స్నేహితుల దగ్గర చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

Updated Date - Jul 23 , 2024 | 03:10 PM