AR Rahman: రెహ్మాన్ డైవర్స్.. అమీన్ ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Nov 20 , 2024 | 08:49 AM

ఏఆర్ రెహ్మాన్, సైరా బాను విడాకులపై కుమారుడు ఏఆర్ అమీన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీనిపై రెహ్మాన్, ఆయన అభిమానులు ఎలా రియాక్టయ్యారు అంటే..

లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ విడాకులకు సంబంధించిన వార్త కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. 1995లో సైరా బాను, రెహ్మాన్ వివాహం చేసుకున్నారు. త్వరలోనే 30 ఏళ్ల వివాహ బంధ వేడుకులు గ్రాండ్ గా జరుపుకోవాల్సి ఉంది. కానీ.. అనూహ్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సైరా బాను లాయర్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీనిపై రెహ్మాన్, ఆయన అభిమానులు ఎలా రియాక్టయ్యారు అంటే..


WhatsApp Image 2024-11-19 at 23.25.23 (1).jpegఏఆర్ రెహ్మాన్, సైరా బాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు సైరా లాయర్ వందన షా మీడియా ప్రకటన చేసింది. దీంతో ఈ వార్త కలకలం రేపింది. ఈ ప్రకటనలో " వివాహం చేసుకున్న ఎన్నో ఏళ్ల తర్వాత సైరా, ఆమె భర్త రెహ్మాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దంపతులిద్దరూ ఒకరి పట్ల మరొకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ.. ఉద్రిక్తతలు, ఇబ్బందుల నేపథ్యంలో వారి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. దీంతో ఎంతో బాధాకరమైనప్పటికీ విడిపోవాలని సైరా, రెహ్మాన్ నిర్ణయించుకున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో తమను అర్థం చేసుకోవాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని సైరా, రెహ్మాన్ కోరుతున్నారు" అంటూ పేర్కొన్నారు.


1995, మార్చి 12న వీరిద్దరూ పెద్దల సమక్షంలో నిఖా చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఖతీజా, రహీమాతో పాటు ఒక అబ్బాయి అమీన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమీన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తమ తల్లితండ్రుల వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి వారి గోప్యతకు స్వేచ్ఛను ఇవ్వాలని కోరారు.

WhatsApp Image 2024-11-19 at 23.25.23 (2).jpeg


ఇక రెహ్మాన్ స్పందిస్తూ.. "మేము గ్రాండ్ థర్టీకి చేరుకోవాలని ఆశించాం.. కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చింది. ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో.. తమ పరిస్థితిని అర్థం చేసుకొని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలు" అంటూ #arrsairaabreakup అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు.


WhatsApp Image 2024-11-19 at 23.25.23.jpeg

మరోవైపు రెహ్మాన్ ఫ్యాన్స్ నెటిజన్లు ఈ నిర్ణయం పట్ల ఆశ్చర్యంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో దైర్యంగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేయాల్సిన అవసరం లేదని నెటిజన్లని కోరారు. రెహ్మాన్ కుమారుడు అమీన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సంగీతలోకంలో ప్రయాణం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 20 , 2024 | 08:51 AM