Salman Khan: సల్మాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మెసేజ్.. అందులో ఏముందంటే
ABN , Publish Date - Oct 18 , 2024 | 10:39 AM
తాము చెప్పినట్లు చేయకపోతే సల్మాన్‌కి చావే అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే గతంలో సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపిన బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్‌ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్‌కి ప్రాణ భిక్ష పెడతామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ఒక మెసేజ్ పాస్ చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే..
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (Baba siddique) హత్య తర్వాత సల్మాన్ ఖాన్ (Salman Khan) కు ప్రాణగండం వెంటాడుతుంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కి ముంబై పోలీసులు భద్రత పెంచారు. అలాగే తాము చెప్పినట్లు చేయకపోతే సల్మాన్ కి చావే అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే గతంలో సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపిన బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్‌ని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్‌కి ప్రాణ భిక్ష పెడతామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ఒక మెసేజ్ పాస్ చేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే..
సల్మాన్ ఆప్త మిత్రుడు, ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యానంతరం సల్మాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కృష్ణ జింక (Black buck) ని వేటాడిన కేసులో కోర్ట్ సల్మాన్ ఖాన్‌కి ఉపశమనం ఇచ్చిన బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం వదలడం లేదు. బిష్ణోయ్ లకు ఎంతో పవిత్రమైన కృష్ణ జింక ను వేటాడినందుకు సల్మాన్‌ని వదిలే ప్రసక్తే లేదని బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పుడో స్టేట్మెంట్ కూడా విడుదల కూడా చేసింది. తాజాగా ముంబై ట్రాఫిక్ పోలీసులకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. రూ. 5 కోట్లు ఇస్తే సల్మాన్‌ని క్షమించి వదిలేస్తామని, ఒకవేళ చెల్లించకపోతే సిద్ధిఖీ కంటే దారుణమైన చావుని చూస్తాడని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద భద్రతా మరింత పటిష్టం చేశారు. ఈ మెసేజ్ మూలాలను టెక్ టీమ్‌తో కలిసి తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
Also Read- Allu Arjun: యూపీ నుంచి సైకిల్‌పై.. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో..
1998లో సల్మాన్ ఖాన్ ‘హమ్ సాథ్ సాథ్ హై’ మూవీ షూటింగ్ సందర్భంగా ఓ కృష్ణ జింకను వేటాడి చంపాడన్న ఆరోపణలు ఉన్నాయి. చట్టపరంగా ఈ కేసులో సల్మాన్ కొద్ది రోజుల శిక్ష అనంతరం.. అతనికి ఫేవర్‌గా తీర్పు వచ్చింది. కానీ జింక హత్య కేసును మనసులో పెట్టుకున్న లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికీ సల్మాన్‌ను చంపాలని చూస్తున్నాడు. సల్మాన్‌కు సన్నిహితుడైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సల్మాన్ పైనా ఇప్పటికే హత్యాయత్నం జరిగింది. సల్మాన్ ప్రస్తుతం ‘సికిందర్’ సినిమాలో నటిస్తున్నారు.