DPIFFA 2024: ఈ అవార్డ్ అంటే ఎంతో ఇష్టం.. ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న షారుక్ స్పందనిదే..
ABN , Publish Date - Feb 21 , 2024 | 01:28 PM
‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఈ అవార్డ్ అంటే నాకు ఎంతో ఇష్టమని అన్నారు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్. ‘‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024’’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది.
‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఈ అవార్డ్ అంటే నాకు ఎంతో ఇష్టమని అన్నారు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan). ‘‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024’’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. భారత సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘యానిమల్’ చిత్రాలు పోటీ పడ్డాయి. ‘జవాన్’ (Jawan)లో నటనకు గాను ఉత్తమ నటుడిగా షారుక్ అవార్డు అందుకోగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయనతార (Nayanthara) ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. ఇక ‘యానిమల్’ (Animal) సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉత్తమ దర్శకుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. (Dadasaheb Phalke International Film Festival Awards 2024)
విజేతలు వీరే..
ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటి: నయనతార (జవాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)
ఉత్తమ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (జవాన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: వరుణ్ జైన్
ఉత్తమ నేపథ్య గాయని: శిల్పా రావు
విలన్ పాత్రలో ఉత్తమ నటుడు: బాబీ డియోల్ (యానిమల్)
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి: రూపాలీ గంగూలీ (అనుపమ)
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటుడు: నీల్ భట్ (ఘుమ్ హై కిసికే ప్యార్ మేయిన్)
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: ఘుమ్ హై కిసికే ప్యార్ మేయిన్
ఉత్తమ వెబ్ సిరీస్: ఫర్జీ
వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటి: కరిష్మా తన్నా (స్కూప్)
చలనచిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సహకారం: మౌషుమి ఛటర్జీ
సంగీత పరిశ్రమకు అత్యుత్తమ సహకారం: KJ యేసుదాస్
అవార్డు అందుకున్న అనంతరం షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ అవార్డ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాను. ఇన్నాళ్లకు నన్ను ఈ అవార్డు వరించింది. చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డును నా సహ నటులకు అంకితం ఇస్తున్నా. దీనికి కారణమైన ‘జవాన్’ చిత్రయూనిట్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వేదికపై ప్రేక్షకులకు, అభిమానులకు మాటిస్తున్నా.. ఇకపై మంచి సినిమాలతో మరింతగా అందరినీ ఎంటర్‌టైన్ చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Gaami: ఆసక్తికరంగా ‘గామి’ క్యారెక్టర్స్ టీజర్.. విశ్వక్ సేన్‌కే సమస్య!
******************************
*Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది
**************************