Deepika Padukone: ఓటేసిన బాలీవుడ్‌ తారలు.. వైరల్‌ అవుతున్న దీపిక వీడియో!      

ABN , Publish Date - May 20 , 2024 | 04:02 PM

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తెలిసిందే! సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బాలీవుడ్‌ తారలు ఉదయం నుంచి క్యూ లైనలో నిలబడి ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు.

Deepika Padukone: ఓటేసిన బాలీవుడ్‌ తారలు.. వైరల్‌ అవుతున్న దీపిక వీడియో!      

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తెలిసిందే! సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు (Lok Sabha polls) కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బాలీవుడ్‌ తారలు ఉదయం నుంచి క్యూ లైనలో నిలబడి ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పడుకొణె (Deepika padikone) కూడా తన భర్తతో కలిసి పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బేబీ బంప్‌తో ఉన్న దీపిక ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కారు దిగినప్పటి నుంచి ఓటు వేసి కారు ఎక్కే వరకు ఆమె పట్ల జాగ్రత్త వహిస్తూ ఉన్నారు రణ్‌వీర్‌ సింగ్‌ (ranveer singh) ప్రస్తుతం ఈ వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

అక్షయ్‌ కుమార్‌ (Akshay kumar), జాన్వీ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్‌, ఐరా ఖాన్‌, ఫర్హాన్‌ అక్తర్‌, జోయా అక్తర్‌, షాహిద్‌ కపూర్‌ సహా పలువురు తారలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ కూడా తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకూ కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్‌, గతేడాది ఆగస్టులో తొలిసారి భారతీయ పౌరసత్వం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మొదటిసారి తన ఓటు వేశారు.

Updated Date - May 20 , 2024 | 04:31 PM