Kalki 2898 AD: తెలుగు సినిమా ప్రచారాలపై దీపిక పదుకొణె సంచలన నిర్ణయం, ఏంటంటే...

ABN , Publish Date - May 01 , 2024 | 12:22 PM

దీపిక పదుకొణె, రణవీర్ సింగ్ లు తల్లిదండ్రులం కాబోతున్నామని ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ నెలలో దీపిక 'సింగం అగైన్' హిందీ సినిమా చిత్రీకరణలో అదీ పోరాట సన్నివేశంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు జూన్ 27న విడుదలవుతున్న 'కల్కి 2898 ఏడి' సినిమా ప్రచారాలు ఏ విధంగా చెయ్యాలన్న విషయంపై దీపిక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది

Kalki 2898 AD: తెలుగు సినిమా ప్రచారాలపై దీపిక పదుకొణె సంచలన నిర్ణయం, ఏంటంటే...
Deepika Padukone on the sets of Sigham Again

బాలీవుడ్ నటి దీపికా పడుకోన్, భర్త రణవీర్ సింగ్ తల్లిదండ్రులం కాబోతున్నాం అని ఫిబ్రవరిలో ప్రకటించారు. సెప్టెంబర్ లో తమ కాబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని కూడా చెప్పారు. త్వరలో అమ్మ కాబోతున్న దీపికా పదుకొణె అందరిలా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవాలని అనుకోలేదు. నెలల గర్భవతిగా వున్న దీపిక ఈ సమయంలో కూడా తాను చెయ్యాల్సిన సినిమాలు పూర్తి చెయ్యాలని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. (Deepika Padukone has taken a decision regarding the publicity of Telugu film Kalki 2898 AD)

హిందీ సినిమా 'సింగం ఎగైన్' సినిమా చిత్రీకరణలో దీపిక కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదీ కాకుండా ఆ సన్నివేశాలు మామూలు సన్నివేశాలు కావు, పోరాట సన్నివేశాల్లో పోలీసు యూనిఫార్మ్ వేసుకున్న దీపికాని చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అందరూ ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు, అలాగే ఆమెకి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెపుతున్నారు. (Singham Again)

deepikasinghamagain.jpg

హిందీ సినిమాతోపాటుగా తెలుగు సినిమా 'కల్కి 2898 ఏడి' కూడా విడుదలవుతోంది. ఇందులో దీపికా ప్రధాన కథానాయికగా నటిస్తోంది, ఈ సినిమా ముందుగా మే నెలలో విడుదలవుతుందని ప్రకటించారు, కానీ ఇప్పుడు విడుదల వాయిదా పడింది, ఇప్పుడు కొత్త తేదీ జూన్ 27న విడుదలవుతుందని ప్రకటించారు. (Deepika Padukone participated in the shoot of her Hindi film Singham Again directed by Rohith Shetty) అయితే మే నెలలో విడుదలప్పుడు దీపిక ఈ సినిమా ప్రచారాలకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదేమో, కానీ జూన్ అనగానే ఆమెకి ఆ సమయంలో విశ్రాంతి అవసరం ఉండొచ్చని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, దీపిక ఈ 'కల్కి 2898 ఏడి' సినిమాకి ప్రచారాలు ముందుగానే ఇవ్వొచ్చు అంటే, ఇప్పుడు ఈనెలలోనే చేసేయవచ్చు అని చెపుతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ పాత్ర అయిన అశ్వద్ధామని చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. తెలుగు ప్రచారాలు దీపిక లేకుండా చేసేయవచ్చు కానీ, ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయనున్నారు కాబట్టి, అక్కడ కొంచెం ఎక్కువ ప్రచారాలు చెయ్యాలి. అందుకని ఆ హిందీ ప్రచారాలు త్వరలోనే చెయ్యాలని చిత్ర నిర్వాహకులు భావించినట్టుగా తెలుస్తోంది.

deepikasinghamagainone.jpg

దీపిక హిందీ 'కల్కి 2898 ఏడి' సినిమా ప్రచారాలకు వెళ్లడం కష్టం అవుతుందని, ఎందుకంటే ఆమె ఆ సమయంలో తిరగటం కుదరదని, కానీ వీడియో ఇంటర్వ్యూలకి మాత్రం ఆమె సుముఖంగా వున్నట్టుగా తెలుస్తోంది. అందుకని వీడియో ఇంటర్వ్యూలు ఇప్పుడు చేసే అవకాశం కూడా వున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీపిక, రణవీర్ సింగ్ లు దీపిక ప్రెగ్నన్సీ ప్రకటించాక, ఆమె 'సింగం అగైన్' షూటింగ్ లో పాల్గొన్నారు. ఆమె పోలీసు యూనిఫార్మ్ లో సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరి తెలుగు సినిమా 'కల్కి 2898 ఏడి' సినిమా ప్రచారాలు ఇప్పుడు చేస్తారా, లేక దీపికతో వీడియో ఇంటర్వ్యూ లు మాత్రమే తీసుకుంటారా అనే విషయం కోసం చిత్ర నిర్వాహకులు, దీపిక కలిసి నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - May 01 , 2024 | 12:30 PM