Devashish Makhija: మంచి చిత్రాలు దర్శకుడు.. ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి!
ABN , Publish Date - Mar 16 , 2024 | 06:16 PM
దర్శక నిర్మాత దేవాశిశ్ మఖిజా (Devashish Makhija) తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘జోరమ్’ (joram). గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులను ఆలోచింపచేేస చిత్రాలను తెరకెక్కించి.. వసూళ్లు లేక.. పెట్టిన డబ్బు తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారు
దర్శక నిర్మాత దేవాశిశ్ మఖిజా (Devashish Makhija) తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘జోరమ్’ (joram). గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులను ఆలోచింపచేేస చిత్రాలను తెరకెక్కించి.. వసూళ్లు లేక.. పెట్టిన డబ్బు తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాత దేవాశిశ్ మఖిజా. కోల్‌కతాకు చెందిన దేవాశిశ్ లఘు చిత్రాలతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టారు. 2017లో విడుదలైన ‘అజ్జి’ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగువేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అందుకోలేకపోయింది. అనంతరం ఆయన తీర్చిదిద్దిన చిత్రం ‘భోంస్లే’ ప్రజాదరణను సొంతం చేసుకుంది. ఇటీవల మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా ‘జోరమ్’ తీశారు. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎన్నో ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. తన ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేస్తూ తాజాగా మీడియాతో మాట్లాడారు.
‘‘నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు నా వయసు 40 ఏళ్లు. కనీసం సైకిల్ కొనేందుకు కూడా నా వద్ద డబ్బుల్లేవు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు తెరకెక్కించా. కానీ, ఒక్క రూపాయి సంపాదించలేకపోయా. ‘జోరమ్’ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి రాలేదు. దివాలా తీశా. గత ఐదు నెలల నుంచి అద్దె కట్టలేదు. ఇంటి నుంచి నన్ను బయటకు గెంటేయొద్దని యజమానిని బతిమాలుతున్నా. నావద్ద ఇంకా 20 స్ర్కిప్ట్‌లు ఉన్నాయి. వాటిని నిర్మించడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ప్రతిఒక్కరూ తప్పకుండా ఆర్ట్, కామర్స్ మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. ఈ విషయాన్ని నేను ఆలస్యంగా గ్రహించా’’ అని అన్నారు.