OTT- Dunki: సైలెంట్‌గా ఓటీటీలోకి.. వచ్చేసింది!

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:28 PM

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌, అగ్ర దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ కాంబోలో వచ్చిన 'డంకీ' చిత్రం గత ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదలైంది. తాప్సీ కథానాయిక. విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

OTT- Dunki: సైలెంట్‌గా ఓటీటీలోకి.. వచ్చేసింది!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌(Shah rukh Khan), అగ్ర దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ కాంబోలో వచ్చిన 'డంకీ' (Dunki) చిత్రం గత ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదలైంది. తాప్సీ కథానాయిక. విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix OTT) ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. నిజానికి ఈ చిత్రం జనవరిలో విడుదల కావాలి. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అయితే గత ఏడాది షారుక్‌ నటించిన పఠాన్ , జవాన్   చిత్రాలు విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అదే జోరుతో బాద్‌షా ఏడాది చివర్లో క్రిస్మస్‌ కానుకగా భారీ అంచనాల మధ్య డంకీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఆ రెండు చిత్రాలు సాధించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. వసూళ్ల విషయంలో రూ.470 కోట్ల దగ్గర ఆగిపోయింది. ప్రస్తుతం ఓటీటీ వీక్షకులను అలరిస్తోంది.


oytt.jpg
కథ:
పంజాబ్‌లోని ఓ చిన్న పల్లెటూరికి చెందినవాళ్లు మన్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశల్‌), బుగ్గు(విక్రమ్‌ కొచ్చర్‌), బల్లి (అనిల్‌ గ్రోవర్‌).. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. వాటి నుంచి గట్టెక్కడానికి ఇంగ్లాండ్‌ వెళ్లడమే అని వారు సిద్థమవుతారు. కానీ, వీసాలకి తగినంత చదువు, డబ్బు వీరి వద్ద ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి పఠాన్‌ కోట్‌ నుంచి జవాన్‌ హర్‌ దయాళ్‌ సింగ్‌ థిల్లాన్‌ అలియాస్‌ హార్డీ సింగ్‌ (షారుక్‌ ఖాన్‌) దిగుతాడు. ఆ నలుగురి పరిస్థితిని అర్థం చేసుకుని సాయం చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అక్రమ మార్గంలో ఇంగ్లాండ్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్ని దేశాల సరిహద్దులను దాటి వెళ్లగలిగారా? ఇంతకీ వాళ్ల సమస్యలేంటి? తిరిగి మాతృదేశానికి వచ్చారా? అన్న అంశాల ఇతివృత్తం ఈ చిత్రం.

Updated Date - Feb 15 , 2024 | 12:28 PM