Bollywood - Govinda: నటుడు గోవిందాకు బుల్లెట్ గాయం .. సీఎం ఫోన్
ABN , Publish Date - Oct 01 , 2024 | 10:16 AM
బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాకు (Govinda) బుల్లెట్ గాయం అయ్యింది.
బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాకు (Govinda) బుల్లెట్ గాయం అయ్యింది. ఈ రోజు ఉదయం ప్రమాదవశాత్తు గన్ పేలి (Gun Fire) ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఆయన ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను తీసుకెళ్తుండగా అది చేయి నుంచి జారి కిందపడింది. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వైద్యులు బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారని గోవిందా మేనేజర్ శశి సిన్హా తెలిపారు. ‘నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ వల్ల నేను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాను. కాలులో బుల్లెట్ తొలగించారు’ అని గోవిందా ఆస్పత్రి నుంచి ఒక వాయిస్ విడుదల చేశారు.
మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నటుడు గోవిందాతో ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులను ఆదేశించారు
1986లో లవ్ 86 చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు గోవిందా. ఇప్పటిదాకా 130కి పైగా సినిమాల్లో నటించారు. రొమాంటిక్, కామెడి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గోవిందా మంచి నటుడే కాదు డాన్సర్ కూడా.