Netflix: టాప్‌లో భారతీయ చిత్రాలే!
ABN , Publish Date - May 25 , 2024 | 05:18 PM
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ సినిమాల హవా నడుస్తోంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మన సినిమాలు కోట్ల వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉన్నాయి.
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ సినిమాల హవా నడుస్తోంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మన సినిమాలు కోట్ల వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. తాజాగా ఈ సంస్థ 2023లో అత్యధిక వ్యూస్ తెచ్చిన చిత్రాల వివరాలను వెల్లడించింది. ‘వాట్ వి వాచ్డ్: ఎనెట్ఫ్లిక్స్ ఎంగేజ్మెంట్ రిపోర్ట్’ పేరుతో గతేడాది జులై నుంచి డిసెంబర్ వరకు వచ్చిన వ్యూస్‌ను విడుదల చేసింది. ఇందులో ఇండియన్ కంటెంట్ సత్తా చాటింది. మూవీస్, సిరీస్, షోలు అన్ని కలిపి వన్ బిలియన్ వ్యూస్ సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా 2023 సెకండ్ హాఫ్‌లో 90 బిలియన్ల గంటలు నమోదైనట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. కరీనా కపూర్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘జానెజాన్’ (Jaane Jaan) 20.2మిలియన్ల వ్యూస్‌తో ఫస్ట్ ఫ్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో 16.2 మిలియన్ల వ్యూస్‌తో షారుక్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జవాన్’ (Jawan), మూడులో విశాల్ భరద్వాజ్ నటించిన ‘ఖుషియా’ (Kushiya) (12.1 మిలియన్లు) నిలిచాయి. ‘ఓఎంజీ2’, ‘లస్ట్ స్టోరీస్2’, ‘డ్రీమ్ గర్ల్2’ కూడా మంచి వ్యూస్‌ను దక్కించుకున్నాయి. ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ 10.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. 2023 మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన సినిమాగా ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ 121మిలియన్ల వ్యూస్‌తో మొదటిస్థ్థానంలో ఉంది. వెబ్ సిరీస్ విషయానికొేస్త.. 72మిలియన్ల తో ‘వన్ పీస్’ టాప్‌లో నిలిచింది.