Janhvi Kapoor: జిమ్ బయట అలా నాకు నచ్చదు!
ABN , Publish Date - May 25 , 2024 | 04:51 PM
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ (Mr and MS Mahi) ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ (Mr and MS Mahi) ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తుంది. "నాకు హిస్టరీ అంటే ఎంతో ఇష్టం. బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ ‘ఈ ఇద్దరి గురించి వినడం, మాట్లాడటం నాకెంతో ఇష్టం. వీళ్లు మన సమాజానికి ఎంతో సాయం చేశారు. ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. అందుకే ఈ ఇద్దరికీ సంబంధించిన ఏ అంశమైనా నాకు ఆసక్తిగానే ఉంటుంది. కులాలపై అంబేడ్కర్ దృక్కోణం ముందునుంచీ చాలా కఠినంగానే ఉండేది. కాలక్రమేణా గాంధీ దాన్ని మారుస్తూ వచ్చారు. మన సమాజంలో కుల సమస్య అనేది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కులంపై మూడో వ్యక్తి అభిప్రాయం.. ఆ జీవితాన్ని అనుభవిస్తున్న వారి అభిప్రాయానికి మధ్య చాలా తేడా ఉంటుంది’’ అని అన్నారు.
తన ఫొటోల గురించి చెబుతూ "సెలబ్రిటీల కొత్త ఫొటోల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. అందుకే తారలు కనిపించగానే ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్‌మనిపిస్తుంటారు. నేను ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 25సార్లు విమానంలో ప్రయాణించా.. విమానాశ్రయానికి వెళ్లేసరికి ఫోటోగ్రాఫర్లు సిద్థంగా ఉంటారు. ఇక సినీతారల కోసం ఫొటోగ్రాఫర్లు ఎదురుచూేస మరో ప్రదేశం జిమ్. అక్కడ సెలబ్రిటీలను చాలామంది ఫొటోలు తీస్తుంటారు. నన్ను అలా చేయొద్దు అని చాలాసార్లు కోరాను. జిమ్ చేసే సమయంలో బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటాను. ఆ దుస్తుల్లో తీసిన ఫొటోలు వైరలైతే నాకు అలాంటి డ్రెస్‌లే ఇష్టమని అందరూ అనుకుంటారు. అందుకే జిమ్ బయట ఫొటోలు దిగడం నాకు నచ్చదు’ అని అన్నారు.