Janhvi Kapoor: ఆ హీరో ఇచ్చిన చెత్త సలహా అది!
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:57 PM
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అనే ట్యాగ్‌ను దాటి, క్రమక్రమంగా స్టార్ హీరోయిన్గా మారుతోంది జాన్వీ కపూర్(Janhvi Kapoor). తరచూ జిమ్‌లో కనిపించే తారల్లో ఈమె ఒకరు.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అనే ట్యాగ్‌ను దాటి, క్రమక్రమంగా స్టార్ హీరోయిన్గా మారుతోంది జాన్వీ కపూర్(Janhvi Kapoor). తరచూ జిమ్‌లో కనిపించే తారల్లో ఈమె ఒకరు. ఇంట్లో ఉన్నా, షూటింగ్లో ఉన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఈ ముద్దుగుమ్మ తన ‘ఫిట్నెస్ మంత్ర’ (Fitness Mantra)గురించి ఏం చెబుతోందంటే...
అలా... స్లిమ్‌గా...
ఒకప్పుడు బొద్దుగా ఉండేదాన్ని. అయితే ఇలా స్లిమ్‌గా మారడానికి చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. సరళమైన జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారపు అలవాట్లతో ఫిట్నెస్ ప్రయాణాన్ని మొదలెట్టా. చిన్నచిన్న వ్యాయామాలతో షురూ చేసి క్రమంగా కఠినమైన వాటిని ప్రయత్నిస్తూ వచ్చా. చక్కెర, జంక్ ఫుడ్ పూర్తిగా ఆపేయాల్సి వచ్చింది. మొదట్లో కాస్త కష్టమనిపించింది క్రమంగా అలవాటయ్యింది. మొత్తానికి కఠోరంగా శ్రమించి నాజూకుగా తయారయ్యా. (Bollywood Heroine)
ఆయనే నాకు స్ఫూర్తి
ఫిట్నెస్ విషయంలో నేను చాలామందికి స్ఫూర్తి కావొచ్చు కానీ నాకు ప్రేరణ మాత్రం మా అంకుల్ అనిల్ కపూర్. 66 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా కనిపించడం ఆయనకే సాధ్యం. ఫిట్నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. తనను తాను ఎలా అంత ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకుంటున్నారోనని ఆలోచిస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది.
పైలెట్స్కే నా ఓటు
పైలెట్స్... అన్ని వర్కవుట్స్‌లో కెల్లా ఇదే నా ఫేవరెట్. మానసిక ఆరోగ్యాన్ని, శరీరాన్ని సమతుల్యం చేయడంలో చక్కగా సహాయపడుతుంది. అలాగే రోజంతా నన్ను చురుకుగా ఉంచుతుంది. దాంతోపాటు కండరాలను పటిష్టం చేస్తుంది. బిజీ షెడూల్స్ వల్ల ఒక్కోసారి జిమ్‌కి వెళ్లలేని సందర్భాల్లో ఇంట్లోనే కొన్ని తేలికపాటి యోగాసనాలు చేస్తుంటా. దాంతో పాటు హిప్ లిఫ్ట్‌లు, బటర్ ఫ్లై హిప్ లిఫ్ట్‌లు, స్క్వాట్స్ వంటి కొన్ని ఏరోబిక్స్ కూడా ప్రయత్నిస్తుంటా.
రెండింటి సమన్వయమే...
నా దృష్టిలో ఫిట్నెస్ అంటే శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం. ఎందుకంటే ఆ రెండూ అంతర్గతంగా ఒకదానితో ఒకటి సమన్వయంతో ఉంటాయి. వాటిల్లో ఏది బలహీనపడినా దాని ప్రభావం ఇంకోదానిపై పడుతుంది. కాబట్టి ఈ రెండింటికీ యోగా సరైన మార్గం. యోగా నా మనసుకు రిలాక్సేషన్ థెరపీలా పనిచేస్తుంది. అలాగే బిజీ షెడ్యూల్స్‌లో కూడా చురుకుగా పనిచేసేలా నా శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
అదొక చెత్త సలహా...
మొదట్లో బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల సలహాలు ఇచ్చారు. రోజులో కేవలం ఒక్క పూట మాత్రమే తింటే సులువుగా బరువు తగ్గొచ్చని ఓ నటుడు చెత్త సలహా ఇచ్చాడు. అలా ఒక్క పూట ఆహారం తీసుకోవడం వల్ల కొన్ని కిలోల బరువు తగ్గొచ్చుగానీ... దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. అదృష్టవశాత్తు నేను ఆ సలహా పాటించలేదు.
డైట్లో ఇవి ఉండాల్సిందే...
ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగుతా. పండ్ల రసాలు, బ్రెడ్ టోస్ట్, గుడ్డులోని తెల్లసొన లాంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకుంటా. మధ్యాహ్నం భోజనంలో బ్రౌన్ రైస్, గ్రిల్డ్ఫిష్, పండ్లు లేదా కూరగాయల సూప్ తీసుకుంటా. ఇక రాత్రిపూట సులభంగా జీర్ణమయ్యే ఉడికించిన కూరగాయలు, సలాడ్స్, సూప్స్ ఉండాల్సిందే.
ఫిట్‌నెస్‌లో రాజీపడను
నేను వ్యక్తిగతంగా కార్డియో, సె్ట్రంగ్త్ ట్రైనింగ్, పైలెట్స్, డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతా. వర్కవుట్స్ కోసం క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తుంటా. వీటితోపాటు ఇంట్లో జాగింగ్, స్విమ్మింగ్, యోగా, జంపింగ్ వంటి వ్యాయామాలు కూడా చేస్తా. ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీపడను.